కీర‌వాణి వార‌సులే లేరాయె

Last Updated on by

సుస్వ‌రాల మ‌ర‌క‌త‌మ‌ణి ఎం.ఎం.కీర‌వాణి పుట్టిన‌రోజు నేడు. టాలీవుడ్‌ని మూడు ద‌శాబ్ధాలుగా ఏల్తున్న ఆయ‌న సంగీతానికి ఉన్న ప్ర‌త్యేక‌గ గురించి విడిగా చెప్పాల్సిన ప‌నేలేదు. తెలుగుద‌నం నిండిన దేశీ మ్యూజిక్ కొట్ట‌డంలో ఆయ‌న్ని బీట్ చేసేవాడే లేడు. అందుకే ఇన్నేళ్ల‌లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని ఆయ‌న ఖాతాలో వేసుకున్నారు. ఎంద‌రో న‌వ‌త‌రం ట్యాలెంట్‌ని వెలికి తీసి అవ‌కాశాలిచ్చిన మంచి మ‌నిషి కీర‌వాణి అని ఆయ‌న శిష్య‌గ‌ణం చెబుతుంటారు. పాడుతా తీయ‌గా నుంచి ఎంద‌రినో ఆయ‌న త‌న కొలువులో అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేశారు.

అదంతా అటుంచితే.. ఎందుక‌నో ఇటీవ‌లి కాలంలో కీర‌వాణి ప్ర‌భ కాస్తంత త‌గ్గింద‌నే చెప్పాలి. `ఆఫీస‌ర్` రిలీజ్‌ టైమ్‌లో త‌న‌కు పెద్ద అవ‌కాశాలేవీ లేవ‌ని, ఏకంగా నాగార్జున‌ను అవ‌కాశం అడిగారు కీర‌వాణి. శివ సినిమాకి అడిగాను.. అయినా కొత్త‌వాడైన నాకు ఛాన్సివ్వ‌కుండా ఇళ‌య‌రాజాను తీసుకున్నారు. స‌ర్ నాకు మొహ‌మాటం లేదు .. ఒక్క చాన్స్ ప్లీజ్ అని సిగ్గు విడిచి అడిగారు. ఇక‌పోతే కీర‌వాణి ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచికి సంగీతం అందిస్తున్నారు. ఈ వ‌య‌సులో 25ఏళ్ల కెరీర్‌లో ఇంకా అవ‌కాశాలు అడుక్కోవ‌డం అవ‌స‌ర‌మా? అని అన‌కూడదు. ఎందుకంటే ఇండ‌స్ట్రీ ఇంతే. స‌క్సెస్ ఉన్న‌ప్పుడే అవ‌కాశాలిస్తుంది. అది మొహం చాటేస్తే ఎంత‌టి ఘ‌నుల‌కైనా ఛాన్స్ ఇవ్వ‌నే ఇవ్వ‌రు. ఎం.ఎం.కీర‌వాణి కెరీర్‌లో అవార్డులు రివార్డుల‌కు కొద‌వే లేదు. ఒక జాతీయ అవార్డు అందుకున్నారు. ఏకంగా ఎనిమిది నందులు అందుకున్న మొన‌గాడు ఆయ‌న‌. కీర‌వాణి త‌ర్వాత మ‌ళ్లీ సంగీతం లో తెలుగు వాళ్ల‌లో మ‌ళ్లీ అంత సీనే క‌నిపించ‌లేదెందుకో!!

User Comments