కీర్తి ప్రేమ పెళ్లికి రెడీ

`మ‌హాన‌టి` చిత్రంలో సావిత్రి పాత్ర‌లో న‌టించి మెప్పించింది కీర్తి సురేష్‌. టాలీవుడ్ 85ఏళ్ల చ‌రిత్ర‌లో ఇలాంటి ఒక సినిమా తీస్తార‌ని, అందులో కీర్తిని అదృష్టం వ‌రిస్తుంద‌ని ఎవ‌రూ క‌ల‌గ‌న‌లేదు. ఊహించ‌నిది జ‌రిగితే ఆ ప‌రిణామం ఎలా ఉంటుందో కీర్తి ప్ర‌త్య‌క్షంగా అనుభ‌విస్తోంది. మ‌హాన‌టి ఘ‌న‌విజ‌యంతో కీర్తి ఇమేజ్ అనూహ్యంగా స్కైని ట‌చ్ చేసింది. ఇప్పుడు త‌న‌ని రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ పాత్ర‌ల్లో చూడ‌లేని స‌న్నివేశం ఉంది మ‌రి. కీర్తి కోస‌మే క‌థ‌లు రాయాల్సిన సీన్ వ‌చ్చేసింది. అదంతా స‌రే.. అల‌నాటి మేటి న‌టి మేన‌క కుమార్తె అయిన కీర్తి సురేష్ పెళ్లి ఎప్పుడు? త‌ను పెళ్లాడితే ప్రేమ వివాహం చేసుకుంటుందా? లేక ఇంట్లోవాళ్లు కుదిర్చిన సంబంధం చేసుకుంటుందా? ఇదే ప్ర‌శ్న త‌న‌నే అడిగితే ఏం చెప్పిందో తెలుసా?

నో డౌట్‌! లవ్ మ్యారేజే అంటూ త‌న‌దైన శైలిలో డేరింగ్‌గా సమాధానమిచ్చింది. మ‌స్ట్‌గా ప్రేమ వివాహ‌మే చేసుకుంటాన‌ని సెల‌విచ్చింది. అయితే దానికి స‌హేతుక కార‌ణాల్ని చెప్పింది. కీర్తీ సురేశ్ మామ్ – డాడ్ ల‌వ్‌మ్యారేజ్ చేసుకున్నారు. అలానే అక్క‌లంతా ప్రేమ వివాహం చేసుకుని, అంతా సంతోషంగా లైఫ్‌లో సెటిల‌య్యారు. అందుకే త‌ను కూడా ల‌వ్ మ్యారేజ్‌కే ఓటేస్తోంది. అయితే ఎవ‌రిని పెళ్లాడుతావ్‌? అని ప్ర‌శ్నిస్తే మాత్రం గ‌తుక్కుమంది. ఇంకా త‌న స‌ఖుడు ఎవ‌రో తేల్చుకోలేద‌ట‌. ఒక‌వేళ ప్రేమిస్తే గ‌నుక క‌చ్ఛితంగా త‌ల్లిదండ్రుల‌ను ఒప్పిస్తాన‌ని మాటిచ్చింది. అలాంటి క‌మిట్‌మెంట్ ఉన్న అమ్మాయి కాబ‌ట్టి ఎవ‌రైనా ప్రేమించే సాహ‌సం చేస్తే బావుంటుంది. ఆ ఛాన్స్ మీదే కావొచ్చేమో! ట్రై యువ‌ర్ ల‌క్‌!!