కీర్తిసురేష్ ఒప్పుకుంటుందా అస‌లు..?

Last Updated on by

ఒక్క సినిమా చాలు.. ఇండ‌స్ట్రీలో జాత‌కాలు మారిపోవ‌డానికి. అచ్చంగా కీర్తిసురేష్ విష‌యంలోనే ఇదే జ‌రిగింది. అజ్ఞాత‌వాసితో అమ్మాయిపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిసింది. స్టార్ హీరోల కోసం కథ లేని సినిమాలు చేస్తుంద‌ని విమ‌ర్శించారంతా. త‌ర్వాత మ‌హాన‌టితో తిట్టిన నోళ్లే పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించాయి. అస‌లు ఈ భామ త‌ప్ప ప్ర‌పంచంలో మ‌రే హీరోయిన్ సావిత్రి కంటే బాగా చేయ‌లేర‌ని ఫిక్స్ అయిపోయారు. ఆమెను చూసిన క‌ళ్ళ‌తో మ‌రో హీరోయిన్ ని ఇప్పుడు సావిత్రిలా చూడ‌టం కూడా క‌ష్ట‌మే. అలా చేస్తే అస‌లుకే మోసం వ‌స్తుంది. ఈ విష‌యం బాగా అర్థం చేసుకుని ఇప్పుడు క్రిష్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసాడు. తాను తెర‌కెక్కిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ లో సావిత్రి పాత్ర కోసం మ‌రోసారి కీర్తిసురేష్ నే ఎంచుకుంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

సావిత్రి పాత్ర‌లో ఈమె కంటే బెట‌ర్ యాక్ట్రెస్ ను ప‌ట్టుకోవ‌డం క్రిష్ వ‌ల్ల కావ‌ట్లేదు. అందుకే కాస్త క‌ష్ట‌మైనా ప‌ర్లేదు కానీ కీర్తినే ఒప్పించే ప‌నిలో ఉన్నాడు క్రిష్. అయితే కీర్తి మాత్రం మ‌రోసారి మ‌హాన‌టి పాత్ర‌లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించ‌ట్లేదని తెలుస్తుంది. ఒక్క‌సారి చేసిన పాత్ర‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ చేస్తే ప్రేక్ష‌కుల‌కు మొనాటినీ వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డుతుంది కీర్తి. మ‌రోవైపు ఎన్టీఆర్ జీవితంలో సావిత్రి పాత్ర కీల‌కం. ఆమెతో రిలేష‌న్ కూడా అద్భుతం. అందుకే ఈ పాత్ర కోసం మ‌రో ఆలోచ‌న లేకుండా కీర్తినే అనుకుంటున్నాడు. మ‌రి.. ఈ పాత్ర‌కు కీర్తి ఒప్పుకుంటుందో లేదో..?

User Comments