భామ‌లు బంతాడేస్తున్నారు!

Last Updated on by

అంద‌గ‌త్తెలు ఆటాడుకుంటున్నారు. బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నారు. అందం, అభిన‌యం వీటికి తోడు గ్లామ‌ర్ ఎలివేష‌న్‌తో బాక్సాఫీస్ ఆట తెలివిగానే ఆడుతున్నారు. అందివ‌చ్చిన అవ‌కాశాల్ని అందిపుచ్చుకుని మార్కెట్లో త‌మ స‌త్తా ఏంటో చూపిస్తున్నారు. మొన్న‌టికి మొన్న మ‌హాన‌టి సినిమాతో కీర్తి సురేష్‌, రాజీ సినిమాతో ఆలియా భ‌ట్ ఇదే తీరుగా నిరూపించుకున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద నాయికా ప్ర‌ధాన సినిమాల‌తో సత్తా చాటారు. ఈ వారంలోనే కీర్తి సురేష్ న‌టించిన `మ‌హాన‌టి`, అటు బాలీవుడ్‌లో ఆలియా భ‌ట్ న‌టించిన `రాజీ` బాక్సాఫీస్ బ‌రిలోకి వ‌చ్చాయి. మ‌హాన‌టి కేవ‌లం తొలి మూడు రోజుల్లో 29కోట్ల గ్రాస్‌, 17కోట్ల‌ షేర్‌ వ‌సూలు చేసి దుమ్ము దులిపేసింది. శాటిలైట్ బిజినెస్‌లోనూ 11కోట్ల మేర ఈ సినిమాకి వ‌ర్క‌వుటైంద‌ని తెలుస్తోంది. మ‌హాన‌టి థియేట్రిక‌ల్ రైట్స్ ఏకంగా 20కోట్ల‌కు విక్ర‌యిస్తే, ఆ మొత్తం ఈపాటికే రిట‌ర్న్ వ‌చ్చేసింద‌ని స‌మాచారం.

సేమ్ టైమ్ బాలీవుడ్‌లో రిలీజైన ఆలియాభ‌ట్ `రాజీ` తొలి వీకెండ్ ఏకంగా 25కోట్ల మేర వ‌సూలు చేసింది. ఈ సినిమా శాటిలైట్ స‌హా ఓవ‌రాల్‌గా భారీ బిజినెస్ చేసింది. కేవ‌లం థియేట్రిక‌ల్ రైట్స్‌లో 33కోట్ల మేర బిజినెస్ చేసింది. ఆ మొత్తాన్ని తొలి వారంలోనే వ‌సూలు చేసేస్తోంది. ఇండో-పాక్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా ఆలియా కెరీర్ బెస్ట్‌గా నిలిచింద‌న్న రిపోర్ట్ అందింది. ఇదివ‌ర‌కూ స్వీటీ అనుష్క న‌టించిన `భాగ‌మ‌తి` చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులిపేసిన సంగ‌తి తెలిసిందే. భాగ‌మ‌తి దాదాపు 60కోట్ల మేర వ‌సూలు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. ఈ జోరు చూస్తుంటే, న‌వ‌త‌రం నాయిక‌ల హ‌వా పెరిగింద‌ని, నాయికా ప్రాధాన్య సినిమాల‌కు జ‌నాద‌ర‌ణ పెరిగింద‌ని అర్థ‌మ‌వుతోంది.

User Comments