కీర్తిసురేష్.. త‌మిళ్ లో V 3..

Last Updated on by

నెల రోజుల కింది వ‌ర‌కు కీర్తిసురేష్ అంటే ఫ్లాప్ హీరోయిన్. అజ్ఞాత‌వాసి దెబ్బ‌కు క‌నిపించ‌కుండా పోయిన ఓ ప్లాప్ హీరోయిన్. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఈ ఇండ‌స్ట్రీలో ఒక్క సినిమా చాలు జాత‌కాలు మారిపోవ‌డానికి. కీర్తి విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. మ‌హాన‌టితో మోడ్ర‌న్ మ‌హాన‌టి అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. దాంతో ఇప్పుడు ఈ భామ‌కు క్రేజ్ కూడా అలాగే పెరిగిపోయింది. తెలుగులో కీర్తికి వ‌ర‌స‌పెట్టి అవ‌కాశాలు ఇచ్చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. స్టార్ హీరోల సినిమా అంటే క‌థ ఉండ‌దు అనే లెక్క‌కు వ‌చ్చేసింది అజ్ఞాత‌వాసి దెబ్బ‌తో. దాంతో ఇక్క‌డి కంటే త‌మిళ్ లోనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తుంది ఈ భామ‌.

త‌మిళ్ లో విక్ర‌మ్ తో సామి స్క్వేర్.. విజ‌య్ తో మురుగ‌దాస్ సినిమా.. విశాల్ తో పందెంకోడి 2 సినిమాల్లో న‌టిస్తుంది. ఈ మూడు సినిమాలు ఇదే ఏడాది విడుద‌ల కానున్నాయి. ఈ ముగ్గురు హీరోల పేర్లు కూడా వి తోనే మొద‌ల‌వుతున్నాయి. ప్ర‌స్తుతం వి 3తో అక్క‌డ బిజీగా ఉన్న కీర్తి.. ఇప్పుడు శివ‌కార్తికేయ‌న్ కోసం ఓ చిత్రంలో అతిథి పాత్ర కూడా వేయ‌బోతుంది. అయితే త‌మిళ‌నాట ఇంత బిజీగా ఉన్నా.. తెలుగులో మాత్రం వ‌చ్చిన అవ‌కాశాల‌కు కూడా నో చెబుతుంది ఈ భామ‌. రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ లో మాత్ర‌మే కీర్తి న‌టించే అవ‌కాశం క‌నిపిస్తుంది. మొత్తానికి మ‌హాన‌టి త‌ర్వాత క‌థ‌పై మ‌రీ దృష్టి ఎక్కువైపోయింది ఈ మోడ్ర‌న్ మహాన‌టికి.

User Comments