అమ్మడు చాలా కష్టపడింది

Last Updated on by

అమ్మాడి అంటే ఇప్పుడు అంద‌రికీ గుర్తొచ్చేది ఒక్క‌రే కీర్తిసురేష్. మ‌హాన‌టిలో జెమిని గ‌ణేషన్ ముద్దుగా సావిత్రిని పిలిచే పేరు ఇది. ఇప్పుడు దీనికి కీర్తిసురేష్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిపోయింది. అమ్మాడిగా తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల ప్రేక్ష‌కుల‌ను కూడా అల‌రిస్తుంది కీర్తి. ఇక ఇప్పుడు ఈమె ఈ చిత్రం కోసం ఎంత‌గా క‌ష్టప‌డిందో తెలుసుకునే వీడియో ఒక‌టి విడుద‌లైంది. మ‌న భాష కాదు.. మ‌న రాష్ట్రం కాదు.. తెలుగుతో అస‌లు ప‌రిచ‌యం లేదు.. కానీ మ‌హాన‌టిలో కీర్తి న‌ట‌న‌కు అంతా జోహార్ అంటున్నారు. ఆ సినిమా విజ‌యంలో డ‌బ్బింగ్ కూడా కీల‌కం.

కీర్తి సొంత వాయిస్ కాబ‌ట్టే ఆ పాత్ర‌కు అంత‌గా ప్రాణం వ‌చ్చింది. సావిత్రి పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్ప‌డానికి కీర్తి ప‌డిన క‌ష్టం మామూలుగా లేదు. ఒక్కో డైలాగ్ ను నేర్చుకుని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. డ‌బ్బింగ్ స్టూడియోలో కీర్తి క‌ష్టాన్ని విడుద‌ల చేసారు ద‌ర్శక‌ నిర్మాత‌లు. ఈ చిత్రం కోసం ఏకంగా 11 రోజుల పాటు నాన్ స్టాప్ డ‌బ్బింగ్ చెప్పింది కీర్తి. అంత‌గా క‌ష్ట‌ప‌డింది కాబ‌ట్టే ఈ రోజు మ‌హాన‌టి ఈ స్థాయిలో ఉంది.

User Comments