హైకోర్టు తీర్పు ల‌క్ష్మీపార్వ‌తికి చెంప‌పెట్టు!

Last Updated on by

లక్ష్మీస్‌ వీరగ్రంధం సినిమా విడుదలను ఆపాలని కోర్టును ఆశ్రయించిన వారికి వ్యతిరేకంగా కోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటనలో ధర్మం గెలిచింద‌ని తెలిపారు. ఆయన ఆ ప్రకటనలో గతంలో లక్ష్మీపార్వతి ఎన్నిసార్లు చెప్పినా సినిమాను నువ్వు ఏ రకంగా కూడా అడ్డుకోలేవని చెప్పిన నా మాటలు పెడచెవినపెట్టి నన్ను నానా మాటలు మాట్లాడం జరిగింది. నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు లక్ష్మీపార్వతికి ఒక చెంపపెట్టు అని చెప్పవచ్చు. ఇకనైనా లక్ష్మీపార్వతి తెలుసుకొని నాకు క్షమాపణ చెప్పాలి. నన్ను ఆర్ధికంగా, మానసికంగా ఇన్ని రోజులు హింసించి సినిమా తీస్తే రిలీజ్‌ కానివ్వనని ఇచ్చిన ప్రకటనలకు అర్ధమే నేడు దేవుడు నా పక్షాన చేరి హైకోర్టు తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది.

ఒక దర్శకుడిగా భావ ప్రకటనా స్వేచ్ఛతో భావ వ్యక్తీకరణ చేసుకునే హక్కు రాజ్యాంగం మాకు కల్పించినప్పటికీ ఎవరో కొంతమంది వ్యక్తులు ఆపుతాము, చేస్తాము అంటే చూస్తూ ఊరుకునేందుకు నేనేమి చట్టాలు తెలియని వాడిని కాను. నేను నా సినిమాలో కొన్ని యదార్థ సంఘటనలు ప్రజల వద్దనుండి సేకరించిన సంఘటనలకు ఆధారం చేసుకుని చిత్రం నిర్మిస్తా. ఏప్రిల్‌ 8వ తేదీన రిలీజ్‌ చేస్తా. ప్రజలు నా చిత్రాన్ని ఆదరిస్తారన్న నమ్మకం నాకుంది. సినిమా రంగంలో 40 సంవత్సరాలుగా సేవచేసి ఎలాంటి సినిమాలు తీయాలి, ఎలాంటి సినిమాలు తీస్తే సెన్సార్‌ అవుతుంది అనే విధానాలన్నీ పరిపూర్ణంగా తెలిసిన వ్యక్తిని. రామారావుగారు తనపైన వ్యంగ చిత్రాలు తీస్తే, కళాకారులను స్వాగతించాడు. ఇకనైనానా మీ బుద్ది మార్చుకుని మంచి మార్గంలో నడుస్తారని ఆశిస్తా అన్నారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ కు పోటీగా ఈ చిత్రాన్ని కేతిరెడ్డి చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Also Read: Boney  Kapoor Buys The Remake Rights Of  The Block Buster Badhaai Ho 

User Comments