కేజీఎఫ్ 2 కాక‌లు పుట్టిస్తార‌ట‌

రాకింగ్ స్టార్ య‌శ్ న‌టించిన కేజీఎఫ్ 2018లో రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 280కోట్ల షేర్ వ‌సూలు చేసింది. క‌న్న‌డ స‌హా హిందీలో బంప‌ర్ హిట్ కొట్టింది. అలాగే తెలుగు, త‌మిళంలోనూ ఫ‌ర్వాలేద‌నిపించింది. య‌శ్ అనే హీరోని పాన్ ఇండియా హీరోగా ఆవిష్క‌రించిన చిత్ర‌మిది. ప్ర‌శాంత్ నీల్ ట్యాలెంట్.. హోంబ‌లే బ్యాన‌ర్ గురించి ఈ సినిమా వ‌ల్ల‌నే ప్ర‌పంచానికి తెలిసింది.

ప్ర‌స్తుతం  ఈ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. రాఖీ భాయ్ ఈజ్ బ్యాక్ అంటూ ఈసారి మ‌రింత హంగామా చేయ‌బోతున్నారు. కె.జి.ఎఫ్ 2 ఫస్ట్ లుక్ పోస్టర్ ఈనెల 21న సాయంత్రం 5:45 కి విడుదల కానుంది. ఆ మేర‌కు చిత్ర‌బృందం అధికారిక పోస్టర్ విడుదల చేసింది. పార్ట్ 2లో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ అధీరా పాత్ర‌లో న‌టిస్తున్నారు. పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2లో భారీ యాక్ష‌న్ క‌ట్టి ప‌డేయ‌నుంద‌ని తెలుస్తోంది. ఫ‌స్ట్ లుక్  లో య‌శ్ ఎలాంటి స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌నున్నాడో చూడాల్సిందే.