కె.జి.ఎఫ్‌` లైవ్ రివ్యూ& అప్‌డేట్స్

లైవ్ రివ్యూ: 3.0/5.0

ఫ‌స్టాఫ్ ఓకే.. సెకండాఫ్ మ‌రింత బెట‌ర్‌గా ఉంది.. ద‌ర్శ‌కుడు ఒకే పాయింట్‌కి స్టిక్ అయ్యి ఆద్యంతం ముగింపు వ‌ర‌కూ క‌థ‌ను దారి త‌ప్ప‌కుండా న‌డిపించిన తీరు ఆక‌ట్టుకుంది. యాక్ష‌న్ మోడ్‌లో య‌శ్ పాత్ర‌ను చూపించిన తీరు, అత‌డి న‌ట‌న మైమ‌రిపించాయి. కొన్నిచోట్ల ద‌ర్శ‌కుడు తెలుగు సినిమా `ఛ‌త్ర‌ప‌తి` నుంచి స్ఫూర్తి పొందారా? అనిపిస్తుంది. రాజ‌మౌళి స్టైల్లోనే కెజిఎఫ్‌ని చూపించాడు. థీమ్‌కి అనుగుణంగా సాగే పాట‌లు బావున్నాయి. ఓవ‌రాల్‌గా సినిమాని డిఫ‌రెంట్‌గా చూపించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస‌య్యాడు. అన్ని భాష‌ల్లోనూ స‌క్సెస‌య్యే చిత్ర‌మిది అన‌డంలో సందేహం లేదు.

9.00 AM (IST) : గ‌రుడ‌ను చంపేసిన రాఖీ (య‌శ్‌). అయితే ఇక్క‌డో స‌స్పెన్స్.. అస‌లు ప్ర‌ధాని డాన్ య‌శ్‌కి డెత్ వారెంట్ ఎందుకు జారీ చేసిన‌ట్టు.. బ‌హుశా రెండో భాగంలో ఆ సీక్రెట్‌ని రివీల్ చేసే వీలుంది..

8.55 AM(IST): సినిమా ఫైన‌ల్ స్టేజ్‌లో.. భారీ పోరాట దృశ్యం…

8:40 AM (IST) : గూండాల‌పై య‌శ్ ఎటాక్స్.. నాలుగో పాట‌కు వేళాయె.. ధీర ధీర‌.. గుడ్ వ‌న్..

సెంటిమెంట్ సీన్.. బావుంది..

8:35 AM (IST) : మైన్స్ లో మెయింటెనెన్స్ రూమ్‌లో బ్లాస్ట్ .. య‌శ్ కార‌ణం.. ఎవ‌రు పేల్చారో క‌నిపెట్టేందుకు రౌడీల ప్ర‌య‌త్నం..

8:30  AM(IST): మూడో పాట‌కు వేళాయెను.. పాట బావుంది..

8:25 AM (IST) : ఒక పిచ్చోడు రాఖీ క‌థ‌ను మైన్స్ లో ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తున్నాడు.. ద‌ర్శ‌కుడు ఆ సీన్‌ని ప్రెజెంట్ చేసిన వైనం  అద్భుతం..

8.20 AM (IST) : అత్యంత క్రూర‌మైన స‌న్నివేశం చూస్తున్న య‌శ్..

8.15 AM (IST) : ఫైట్ త‌ర్వాత ఒక సామాన్యుడిలా రాఖీ భాయ్ మైన్స్ లోనే నివాసం.. మైన్స్ సెట్ ఫెంటాస్టిక్.. క‌ళ్లు తిప్పుకోలేం..

8.10 AM (IST): ఫ‌స్టాఫ్ త‌ర్వాత రాఖీ ప‌య‌నం కోలార్ మైన్స్ వైపు.. అక్క‌డ గ్యాంగ్‌స్ట‌ర్స్ తో భారీ ఫైట్ సీక్వెన్స్..

ఫ‌స్టాఫ్ ముగిసింది..ఇప్పటికి ఓకే.. క‌థ రొటీనే అయినా.. ప్రేక్ష‌కుడిని ఎంగేజ్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు ప‌నిత‌నం చూపించాడు. తొలి పాట బావుంది.. రెండో పాట ఓకే.

8.00 AM (IST) : పూర్తిగా గ్యాంగ్ స్ట‌ర్ మోడ్‌లో సాగే చిత్ర‌మిది..

7.55 AM (IST) : త‌న తండ్రి చావు కార‌కుడైన గ్యాంగ్ స్ట‌ర్ గ‌రుడ అని రాఖీ తెలుసుకుంటాడు.. కేజీఎఫ్ గ‌నుల్లో త‌దుప‌రి స‌న్నివేశం..

7.50 AM (IST): గ‌్యాంగ్ స్ట‌ర్ గ‌రుడ‌ను చంపేందుకు బెంగ‌ళూరు వ‌చ్చిన రాఖీ.. గ‌రుడ మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ డాన్.. ఎటెంప్ట్ ఫెయిల్..

 సినిమా ఇప్ప‌టికి ఓకే..

7:40 AM (IST) : గ‌్యాంగ్‌స్ట‌ర్ లైఫ్ స్టోరి ర‌న్నింగ్.

7.30 AM (IST): రెండో పాట దోచేయ్.. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా క్ల‌బ్ సాంగ్.. స్కిన్ షో తో.. డ్యాన్సింగ్ కేక‌..

7:25 AM (IST) : మ‌ద‌ర్ సెంటిమెంట్ స‌న్నివేశాలు.. రాఖీ- శ్రీ‌నిధి మ‌ధ్య స్నేహం మొద‌లు.

7:20 AM(IST) : రాఖీ ఓ మిష‌న్‌పై బెంగ‌ళూరు ప‌య‌నం.. అక్క‌డే గ్యాంగ్‌స్ట‌ర్ కుమార్తె శ్రీ‌నిధి తో ప‌రిచ‌యం

7:15 AM (IST) : ఫైట్ త‌ర్వాత సాంగ్.. స‌లామ్ రాఖీ భాయ్..

7: 10 AM(IST) :ముంబైకి వెళ్లిన గ్యాంగ్‌స్ట‌ర్‌ క‌థ‌.. అక్క‌డ రెండు గ్యాంగ్‌ల‌ మ‌ధ్య ఫైట్.. రాఖీ స్టైలిష్ ఇంట్ర‌డ‌క్ష‌న్.. య‌శ్‌ డ‌బ్బింగ్ ఏమంత బాలేదు..

7:05 AM (IST): ఫ‌్లాష్ బ్యాక్ మోడ్‌లోకి.. కోలార్ బంగారు గ‌నుల్లో రాఖీ (య‌శ్) పుట్టుక‌…

7:00 AM (IST): కెజిఎఫ్ తొలి స‌న్నివేశం ప్రారంభం.. 1983లో య‌శ్ క్రిమిన‌ల్ బ్యాక్‌డ్రాప్…య‌శ్‌కి ప్ర‌ధాని నుంచి డెత్ వారెంట్…

21 డిసెంబ‌ర్ వేకువ ఝాము 6.30 ఏఎం (ఇండియా) (అమెరికాలో 20 డిసెంబ‌ర్ 8 పీఎం ఇఎస్‌టీ) నుంచి లైవ్ అప్‌డేట్స్ మీకోసం…

క‌న్న‌డ హీరో య‌శ్ న‌టించిన కె.జి.ఎఫ్ డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, త‌మిళం, హిందీలో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నారు. మిస్ దివా శ్రీ‌నిధి శెట్టి ఈ చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతోంది. త‌మ‌న్నా ఐటెమ్ నంబ‌ర్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఉగ్రం ఫేం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం లో హోంబ‌లే ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించింది. తెలుగు రాష్ట్రాల్లో వారాహి చ‌ల‌న‌చిత్రం అధినేత సాయి కొర్ర‌పాటి రిలీజ్ చేస్తున్నారు.