ఖైదీ త‌మిళ్ తెలుగు వ‌సూళ్లు

Khaidi - File Photo

కార్తీ న‌టించిన ఖైదీ విజ‌య‌వంతంగా రెండో వారంలో ప్ర‌వేశించింది. ఖైదీ 7 రోజుల కలెక్షన్లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. కార్తీ మూవీ వసూళ్లు.. ఎంత రాబట్టిందంటే.. తెలంగాణ, ఏపీలో 7వ రోజు రూ.53 లక్షల కలెక్షన్లు నమోదయ్యాయి. 7 రోజుల్లో మొత్తంగా ఖైదీ వసూళ్లు ప‌రిశీలిస్తే..

నైజాంలో రూ.2 కోట్లకుపైగా సీడెడ్‌లో రూ.38 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.64 లక్షలు ఈస్ట్ రూ.38 లక్షలు,
వెస్ట్ రూ. 25 లక్షలు,  గుంటూరు రూ.30 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.39 లక్షలు, నెల్లూరులో రూ.21 లక్షలు వసూలయ్యాయి. ఇక మొత్తంగా వారం రోజుల్లో రూ.5 కోట్లు వసూలు చేసింది.  తెలుగేతర రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వసూళ్లు చూస్తే..  తమిళనాడులో రూ.25 కోట్లు, కర్ణాటకలో రూ.1.82 కోట్లు, కేరళలో రూ.3.26 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.1.16 కోట్లు వసూలయ్యాయి. ఇక వారం రోజుల్లో ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.40 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. రెండో వారంలో కూడా మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

ఓవర్సీస్ పరిస్థితి చూస్తే.. యూఎస్, కెనడా, ఇతర దేశాల్లో రూ.9.75 కోట్లు వసూలు చేసింది. దాంతో 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్.. 26 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి ఈ చిత్రం ప్రవేశించింది. తెలుగు ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. ఈ చిత్రం బిజినెస్ రూ.4.3 కోట్లు జరిగింది. దాంతో ఈ చిత్రం రూ.5 కోట్లు లక్ష్యంగా బరిలోకి దిగి ఆ మొత్తాన్ని ఏడు రోజుల్లోనే సాధించింది. తమిళంలో రూ.24 కోట్ల బిజినెస్ జరిగితే.. 42 కోట్ల గ్రాస్ కలెక్షన్ల లక్ష్యంతో విడుదలైంది. ఇప్పటికే ఆ మొత్తానికి చేరువై డిస్టిబ్యూటర్లలో సంతోషాన్ని నింపింది.