చిరును కొట్ట‌డం అంత ఈజీ కాదు..!

తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోలు ఎంత‌మందైనా ఉండొచ్చు కానీ లీడ‌ర్ మాత్రం ఒక్క‌డే.. అత‌డే మెగాస్టార్ చిరంజీవి. ఈయ‌న ఉన్న‌పుడు మ‌రో నెంబ‌ర్ వ‌న్ ఉండ‌టం అనేది క‌ష్ట‌మే. గ‌తేడాది వ‌ర‌కు ఆయ‌న లేడు.. కానీ ఈ ఏడాదే మ‌ళ్లీ వేట మొద‌లుపెట్టాడు. వ‌చ్చీ రావ‌డంతోనే ఖైదీ నెం.150తో 100 కోట్ల షేర్ అందుకున్నాడు. ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ నెంబ‌ర్ వ‌న్ తానే అని మ‌ళ్లీ నిరూపించాడు మెగాస్టార్ చిరంజీవి. బాహుబ‌లి కాకుండా మిగిలిన రికార్డుల‌న్నింటినీ త‌న పేర రాసుకున్నాడు అన్న‌య్య‌. మ‌ధ్య‌లో కాట‌మ‌రాయుడు వ‌చ్చినా.. డిజే వ‌చ్చినా.. చిరంజీవి రికార్డుల‌ను మాత్రం క‌దిలించ లేక‌పోయారు. ఇప్పుడు జై ల‌వ‌కుశ‌తో వ‌చ్చాడు ఎన్టీఆర్. ఈయ‌న క‌దిలిస్తాడేమో అనుకున్నారంతా. కానీ తొలిరోజు ఖైదీతో పోలిస్తే 5 కోట్లు త‌క్కువ గానే వ‌సూలు చేసాడు యంగ్ టైగ‌ర్. కాక‌పోతే ఖైదీ నెం.150 త‌ర్వాత స్థానంతో స‌రిపెట్టుకున్నాడు.

ఖైదీ నెం.150 కంటే ఎక్కువ థియేట‌ర్స్ లో విడుద‌లైనా కూడా క‌లెక్ష‌న్ల విష‌యంలో మాత్రం చిరంజీవితో పోటీ ప‌డ‌లేక‌పోయాడు ఎన్టీఆర్. ఈయ‌న న‌టించిన జై ల‌వ‌కుశ తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 21.81 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఈ విష‌యంలో ఖైదీ నెం.150దే అప్ప‌ర్ హ్యాండ్. ఆ చిత్రం 24 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఒక్క కృష్ణా.. సీడెడ్ లో మాత్ర‌మే ఖైదీ రికార్డుల‌కు చెక్ పెట్టింది జై ల‌వ‌కుశ‌. ఓవ‌ర్సీస్ లో అయితే ఖైదీ నెం.150 ప్రీమియ‌ర్స్ తోనే 1.2 మిలియ‌న్ దాటేస్తే.. జై ల‌వ‌కుశ 589000 డాల‌ర్ల‌తో స‌రిపెట్టుకున్నాడు. ఓవ‌రాల్ గా తొలిరోజు 29.29 కోట్ల షేర్ జై ల‌వ‌కుశ రాబ‌డితే.. 35 కోట్ల‌తో నాన్ బాహుబ‌లి రికార్డుల‌న్నింటినీ త‌న పేర రాసుకున్నాడు మెగాస్టార్. ఎన్టీఆర్ వ‌ల్ల కూడా కాలేదు. ఇక ఇప్పుడు చిరంజీవి రికార్డుల‌ను తిర‌గ‌రాయాలంటే అయితే స్పైడ‌ర్ లేదంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25వ సినిమాకు మాత్ర‌మే ఛాన్స్ ఉంది. మ‌రి ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు అన్న‌య్య రికార్డుల‌ను చేరుకుంటారో చూడాలి..!