అందానికి ఆమె టిప్స్ ఇవే

ఆరోగ్యమే మహాభాగ్యం. రోజంతా ఎంత బిజీగా ఉన్నా ఒక ఇరవై నిమిషాల పాటు బ్రిస్క్‌ వాక్‌ లేదా రన్నింగ్‌ చేసినట్లయితే ఒత్తిడి ద‌రి చేర‌దు. నిత్యం జిమ్ కి  వెళ్లి వ్యాయామం చేసినా అది ఆరోగ్యానికి ఎంతో సాయం అవుతుంది. దీంతో పాటే ఆహార నియ‌మాలు చాలా ఇంపార్టెంట్. అయితే ముంబై బ్యూటీ కియారా అద్వానీ స్లిమ్ లుక్ ఆరోగ్యం ర‌హ‌స్యం ఏమిటో తెలుసా?

ఈ విష‌యంపై త‌న‌నే ప్ర‌శ్నిస్తే చాలా ఆస‌క్తిక‌ర సంగ‌తుల్నే చెప్పింది. దేవ‌తాసుంద‌రిని త‌ల‌పించే త‌న మేని ఛాయ‌కు త‌నదైన అందానికి తాను పాటించే టిప్స్ ని రివీల్ చేసింది. శారీరక వ్యాయామంతో  క్యాలరీలు అధికంగా ఖర్చు అవ్వ‌డం ఇంపార్టెంట్. దానికి జిమ్ కి వెళ్లాలి. రోజూ క్రమం తప్పకుండా ఒక చిన్న గిన్నెడు ఓట్స్‌ను తీసుకుంటే కొవ్వును తేలికగా తగ్గించుకోవచ్చు. నీరు తాగడం అన్నది ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా అత్యవసరం. వ్యాయామం చేయడానికి ముందు.. ఆ తరువాత కూడా తప్పనిసరిగా రోజులో కొద్దిసేపయినా వ్యాయామం చేయడం మంచిది. ఇవే కాదు కిక్ బాక్సింగ్ .. డిటాక్సిఫికేష‌న్ వంటివి శ‌రీరానికి ఎంతో రిలీఫ్ ని ఇస్తాయ‌ని కియ‌రా తెలిపింది. వ్యాయామం పై సమస్యలకు మందుగా పనిచేస్తుంది.  ఎక్కువ సేపు ఆహారం తీసుకోవడం వలన ఎక్కువగా తిన్నామన్న ఫీలింగు కలుగుతుంది. దాంతో ఎక్కువ సమయంలో తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు… అంటూ చాలానే చెప్పింది కియ‌రా.