కుర్ర‌హీరోతో కియ‌రా డేటింగ్

Last Updated on by

కియ‌రా అద్వాణీ .. ప్ర‌స్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో మార్మోగిపోతున్న పేరు ఇది. ఇక్క‌డ మ‌హేష్‌, చ‌ర‌ణ్ వంటి స్టార్ల‌తో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ‌, అటు బాలీవుడ్‌లోనూ దుమ్ము దులిపేస్తోంది. అక్క‌డ ల‌స్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లో బోల్డ్ పెర్ఫామ‌ర్‌గా త‌న‌ని తాను ఎలివేట్ చేసుకుని వ‌రుస‌గా ఛాన్సులు ప‌ట్టేస్తోంది. ఇక ఇదే ఊపులో కియ‌రా వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేసేస్తోంది.

తాజాగా కియ‌రా బాలీవుడ్‌లో అదిరిపోయే ఆఫ‌ర్‌ని పట్టేసింది. ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మ‌ప్రొడ‌క్ష‌న్స్‌లో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టులో కియ‌రా క‌న్ఫామ్ అయ్యింది. ఈ విష‌యాన్ని కియ‌రానే స్వ‌యంగా అధికారికంగా ప్ర‌క‌టించింది. అందుకు సంబంధించిన పోస్ట‌ర్‌ని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. కిలాడీ అక్ష‌య్‌కుమార్‌, దిల్జీత్ దోసాంజి, క‌రీనాక‌పూర్ వంటి టాప్ కాస్టింగ్ ఉన్న సినిమాలో తాను న‌టిస్తున్నాన‌ని ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతూ చెప్పుకొచ్చింది. మొత్తానికి కియ‌రా ఒక్కో మెట్టు వేగంగా ఎక్కేస్తోంది. అన్నీ క్రేజీ ప్రాజెక్టుల్లోనే అవ‌కాశాలు అందుకుంటోంది. ఇదిలా ఉంటే కియ‌రా ప్ర‌స్తుతం బాలీవుడ్ కుర్ర‌హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో ప్రేమ‌లో ఉంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇలాంటి ప్ర‌చారం అక్క‌డ కామ‌నే అయినా కియ‌రా మాత్రం దానిని ఖండించ‌క‌పోవ‌డంతో బోలెడ‌న్ని సందేహాలు నెల‌కొన్నాయి.

User Comments