నిర్మాత‌కు కైరా స‌ర్టిఫికెట్!

అవును .. మీరు వింటున్న‌ది నిజ‌మే. టాలీవుడ్‌లో ఓ అగ్ర‌నిర్మాత‌కు కైరా అద్వాణీ పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చింది. అయితే ఇదేం ఝ‌ల‌క్? అని ప్ర‌శ్నిస్తే అక్క‌డే ఉంది అస‌లు మ‌త‌ల‌బు. అస‌లు కైరా అద్వాణీ ఎవ‌రికీ ఏ హానీ త‌ల‌పెట్టలేదు. త‌న నిర్మాత‌ను త‌ప్పు ప‌డుతూ రూమ‌ర్లు పుట్టించిన వాళ్ల‌ను ఉటంకిస్తూ త‌న‌దైన శైలిలో అవ‌త‌లి వారికి కోటింగ్ ఇచ్చింది. ఇంత‌కీ ఏ విష‌యంలో అని ప్ర‌శ్నిస్తే.. నిర్మాత డివివి దాన‌య్యను వివాదంలోకి లాగిన ఇష్యూ గురించి కైరా స్వ‌యంగా స్పందించింది.

బ్యాక్ టు బ్యాక్ ఒకే బ్యాన‌ర్‌లో ప‌ని చేస్తున్నానంటే ఆ బ్యాన‌ర్ గొప్ప‌త‌నం అర్థం చేసుకోవాల‌ని క్లారిటీ ఇచ్చింది కైరా. అయినా నా నిర్మాత పారితోషికం ఎగ్గొట్టార‌న్న దాంట్లో అస్స‌లు ఎంత మాత్రం నిజం లేదు. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి ప‌ని చేయడాన్ని హ్యాపీ ఫీల‌వుతున్నా. `భ‌ర‌త్ అనే నేను` త‌ర్వాత వెంట‌నే ఇదే బ్యానర్‌లో మ‌రో సినిమాలో న‌టిస్తున్నాను. అస‌లు ఎలాంటి ఆధారం లేని ఆరోప‌ణ‌లు విన్న త‌ర్వాత షాక్ తిన్నాను. మా నిర్మాత బంగారం. ఇదే బ్యాన‌ర్‌లో మ‌రో అవ‌కాశం ఇచ్చినా న‌టిస్తాను.. అంటూ త‌న‌దైన శైలిలో క్లారిటీ ఇచ్చింది కైరా. `భ‌ర‌త్ అనే నేను` చిత్రంలో న‌టించిన కైరా ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ – బోయ‌పాటి కాంబినేష‌న్ సినిమాలో అదే డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.