త‌స్స‌దియ్య కియ‌రా మెరుపులే

Last Updated on by

రామ్‌చ‌ర‌ణ్ – కియ‌రా అద్వాణీ జంట కెమిస్ట్రీ గురించి ప్ర‌స్తుతం వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. చెర్రీ మార్క్ స్టెప్పుల‌కు రీచ్ అయ్యేలా డ్యాన్సులు చేసేందుకు ఈ ముంబై బొమ్మ చాలానే శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌ని అర్థ‌మ‌వుతోంది. అందుకు తాజాగా రిలీజ్ చేసిన త‌స్స‌దియ్యా .. వీడియో టీజ‌ర్ ఓ బిగ్ ఎగ్జాంపుల్.

ఈ సాంగ్‌లో ఎక్క‌డా కియ‌రా చ‌ర‌ణ్ రేంజు బాడీ లాంగ్వేజ్ ను ట‌చ్ చేయ‌లేక‌పోయింది. అయితే కియ‌రా చ‌ర‌ణ్ స్థాయి ఎంతో నిజాయితీగానే ఇటీవ‌ల ప్రీరిలీజ్ వేడుక‌లో ఒప్పుకుంది. చ‌ర‌ణ్ ట్యాలెంట్ ని ఒక రేంజులో ఆకాశానికెత్తేసింది. అత‌డి డ్యాన్సింగ్ స్కిల్స్ త‌న‌ను అబ్బుర‌ప‌రిచాయ‌ని, త‌న రేంజులో డ్యాన్సులు చేయ‌డానికి ప్ర‌య‌త్నించాన‌ని అంది. మొత్తానికి త‌స్సాదియ్యా పాట‌లో కియ‌రా పొట్టి నిక్క‌రు ఛ‌మ‌క్కులు మెరిపిస్తున్నాయి. రెడ్ హాట్ అప్పియ‌రెన్స్ మైమ‌రిపిస్తోంది. అయితే దేవీశ్రీ మ్యూజిక్ లోనే అంత ఛ‌మ‌క్కు వినిపించ‌డం లేదన్న విమ‌ర్శ ఉంది. ఇక‌పోతే `విన‌య విధేయ రామ‌` చిత్రాన్ని ఈనెల 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు స‌హా అమెరికాలోనూ భారీగా రిలీజ్ కానుంది. ఆ మేర‌కు థియేట‌ర్ల స‌ర్ధుబాట్ల‌పైనా ఆసక్తిక‌ర ముచ్చ‌ట సాగుతోంది. వీవీఆర్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ప్రైమ్ థియేట‌ర్ల‌ను లాక్ చేశార‌ట‌.

User Comments