డేటింగ్‌పై కియ‌రా క్లారిటీ

Last Updated on by

ఒక అమ్మాయి, ఒక అబ్బాయి స్నేహంగా క‌నిపిస్తే.. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఎఫైర్ అంట‌గ‌ట్టేయ‌డం అన్న‌ది మాన‌వ‌ లోకంలో చాలా స‌హజం. అదే స్నేహం రంగుల ప్ర‌పంచంలో అయితే ఇంకా జోరుగా ప్ర‌చారంలోకి వ‌స్తుంది. ఎవ‌రైనా అందాల క‌థానాయిక హీరోతో క్లోజ్‌గా మూవ్ అయితే అంత‌కుమించిన జెట్ స్పీడ్‌తో ఆ ఎఫైర్‌ వార్త హాట్ టాపిక్ అవుతుంది. సినీజ‌నం చెవులు కొరికేసుకుంటారు.

ప్ర‌స్తుతం మ‌హేష్ నాయిక కియ‌రా అద్వాణీ విష‌యంలో అలానే ప్ర‌చార‌మ‌వుతోందా? ఈ అమ్మ‌డు ల‌స్ట్ స్టోరీస్ కోస్టార్ సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో జోరుగా ప్రేమాయ‌ణం సాగిస్తోంద‌ని బాలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆ ఇద్ద‌రూ ఏ వేడుక‌కు వెళ్లినా ఈ సెగ‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ప్ర‌తిరోజూ మీడియా నుంచి ఎదుర‌య్యే తొలి ప్ర‌శ్న ఇదే అవుతోంది. దానికి స‌మాధానం చెప్ప‌లేక నానా తంటాలు ప‌డుతున్నారు. నిన్న‌నే ఓ ఈవెంట్‌లో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాకి ఈ ప్ర‌శ్న ఎదురైంది. దానికి అత‌డు ఆన్స‌ర్ ఇస్తూ… ఇప్ప‌టికి చేసే ప‌నితోనే ప్రేమ‌లో ఉన్నాను. కియ‌రాతో కాదు! అంటూ ముక్త‌స‌రిగా స‌మాధాన‌మిచ్చాడు. ఈరోజు వేరొక ఈవెంట్‌లో కియ‌రాని ఇదే విష‌య‌మై ప్ర‌శ్నిస్తే ఇంచుమించి సిద్ధార్థ్ త‌ర‌హాలోనే ఎంతో కూడ‌బ‌లుక్కున్న‌ట్టుగా ఆన్స‌ర్ ఇచ్చింది ఈ భామ‌. “ఇప్ప‌టికి కెరీర్‌పైనే దృష్టి సారించాను. ఒక‌వేళ ప్రేమా గీమా ఏదైనా ఉంటే మీడియాతో నేనే చెబుతాను“లే అంటూ స‌న్నాయి నొక్కులు నొక్కింది. అబ్బ‌చ్చా! మాకు తెలీదులే అని మ‌నం అనుకోవాలేమో!!

User Comments