విధేయ రామునికి కియ‌రా షాక్‌

Last Updated on by

బుల్లితెర‌పై నంబ‌ర్-1 యారీ కార్య‌క్ర‌మం ఎంత ఫేమ‌స్ అయ్యిందో తెలిసిందే. హోస్ట్ రానా ట్రీట్ ఆక‌ట్టుకుంటోంది. ఇప్ప‌టికే ఎంద‌రో టాప్ సెల‌బ్రిటీలు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేశారు. ఈసారి అత‌డి గెస్ట్ స్నేహితుడు రామ్ చ‌ర‌ణ్. చెర్రీతో పాటు కియ‌రా ఈ షోలో పాల్గొని అభిమానుల‌కు ట్రీట్ ఇచ్చింది. రానా అడిగే ప్ర‌శ్న‌ల‌కు చ‌ర‌ణ్‌, కియ‌రా ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలే ఇచ్చారు. ఓ ప్ర‌శ్న‌కు కియ‌రా షాకిచ్చే జ‌వాబిచ్చింది. చ‌ర‌ణ్ మైమ్ మిమిక్రీ ఎపిసోడ్ లో అర్జున్ రెడ్డిని త‌ల‌చుకుని ఏడిపించింది. కియ‌రా బాలీవుడ్ అర్జున్ రెడ్డిలో క‌థానాయిక‌. అందుకే అర్జున్ రెడ్డిని త‌ల‌చుకుంద‌న్న‌మాట‌! చెర్రీని స్కూల్, కాలేజ్ డేస్ గురించి రానా  ప్ర‌శ్నించాడు. నువ్వు ఒక రూమ‌ర్ స్ప్రెడ్ చేయాలంటే ఏం స్ప్రెడ్ చేస్తావ్? అంటూ ప్ర‌శ్నిస్తే.. నేను చాలా మంచోడిని.. అని అన్నాడు చ‌ర‌ణ్‌. కియ‌రా అందుకు ప్ర‌తిగా.. చెర్రీ ఫుల్ బ‌ద్మాష్ అని రియ‌లైజ‌య్యా.. ! అంటూ పెద్ద షాక్ నే ఇచ్చింది. విధేయ‌రాముడు టీమ్ తో రానా నంబ‌ర్ 1 యారీ కార్య‌క్ర‌మం అలా రంజింప‌జేయ‌బోతోంది.

User Comments