ఫొటోస్టోరీ: ఆకు చాటు అందం

ఆకుచాటు పిందె తడిసిందో లేదో కానీ… ఇక్కడ అపురూపమైన అందానికి ఆచ్ఛాదనగా మారిన ఆకు జన్మ మాత్రం ధన్యమైపోయింది. కియారా అద్వానీ అసలే హాట్ బ్యూటీ. అమాయకంగా కనిపిస్తూనే కుర్రాళ్లని మాయ చేస్తుంది. అలాంటి భామ ఇక టాప్లెస్గా కెమెరా ముందుకొచ్చేస్తే కుర్రాళ్లు ఏమైపోవాలి? ఆ అందాన్ని చూడటానికి నిజంగా రెండు కళ్లు చాలవంతే.

బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డబూ రత్నానీ క్యాలెండర్ కోసం ఈ ముద్దుగుమ్మ ఇలా కెమెరా ముందుకెళ్లింది. ఆకుని మాత్రమే అడ్డు పెట్టుకుని ఇలా టాప్లెస్గా పోజులిచ్చింది. ఈ ఫొటో సెగలు రేపుతోంది. ఆన్లైన్లో సందడి చేస్తోంది. `భరత్ అనే నేను`తో తెలుగు తెరపైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మకి దక్షిణాదిలోనూ పెద్దయెత్తున అభిమానులు ఏర్పడ్డారు. ఇక హిందీలో అయితే `లస్ట్ స్టోరీస్`తో అదరగొట్టింది. ఇప్పుడు అక్కడ వరుస సినిమాలతో సందడి చేస్తోంది. తెలుగులోనూ మరో దఫా సినిమాలు ఒప్పేసుకుందని సమాచారం.

కియారా అద్వానీ