`సైరా` పై కిచ్చా లోలోన ఇలా

Last Updated on by

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా `సైరా న‌ర‌సింహారెడ్డి` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో దాదాపు 200కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితాన్ని వెండితెర‌పై ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్‌ వంటి సూప‌ర్‌స్టార్ ఓ కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. న‌య‌న‌తార‌, త‌మ‌న్నా క‌థానాయిక‌లుగా ఆడిపాడుతున్నారు. ఇదే చిత్రంలో క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఓ కీల‌క పాత్ర‌కు ఎంపికైన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో త‌న ఆరంగేట్రంపై సుదీప్ ఎంతో ఎగ్జ‌యిట్ అవుతూ సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌తో ఆనందం పంచుకున్నారు. లెజెండ్ చిరంజీవి స‌ర్‌తో హిస్టారిక‌ల్ సినిమా చేస్తున్నా. సురేంద‌ర్ రెడ్డి స‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు అంటూ సుదీప్ ఎంతో ఎగ్జయిటింగ్‌గా తెలిపారు. ఈగ‌లో పూర్తి ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషించిన సుదీప్‌, బాహుబ‌లి చిత్రంలో కొన్ని నిమిషాల పాటు క‌నిపించే అతిధి పాత్ర‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇప్పుడు సైరా న‌ర‌సింహారెడ్డిలో ఎలాంటి పాత్ర‌లో న‌టించ‌నున్నాడో చూడాలి. ఇక‌పోతే సుదీప్ చేరిక‌తో ఈ సినిమాకి క‌న్న‌డ బిజినెస్ ప‌రంగా పెద్ద ప్ల‌స్ కానుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

User Comments