హాట్ బ్యూటీ బికినీ లుక్

Last Updated on by

ఖ‌డ్గం సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన బాలీవుడ్ బ్యూటీ కిమ్ శ‌ర్మ అటుపై ప‌లు చిత్రాల్లో న‌టించింది. అయితే ఆశించిన స్థాయిలో విజ‌యం ద‌క్కించుకోలేక‌పోయిన ఈ అమ్మ‌డు బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత కెరీర్ కి కామా పెట్టి, అలీ పుంజ‌నీ అనే వ్యాపార‌వేత్త‌ను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. అత‌డి నుంచి విడిపోయిన కిమ్ ఆ త‌ర్వాత యువ‌హీరో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణేతో ప్రేమ‌లో ప‌డింది. ఈ జంట‌పై ఇప్ప‌టికే బాలీవుడ్ మీడియా మోతెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

లేటెస్టుగా కిమ్ శ‌ర్మ థాయ్ ల్యాండ్ వెకేష‌న్ నుంచి వేడెక్కించే బికినీ ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో ఫ్లోర‌ల్ డిజైన్ టూపీస్ బికినీలో వేడి పెంచుతోంది. ఇప్ప‌టికైతే స‌ద‌రు యువ‌హీరోని పెళ్లాడుతుందా లేదా అన్న‌ది స‌స్పెన్స్. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణేతో జోరుగా షికార్లు మాత్రం చేస్తోంది కిమ్.

User Comments