`మ‌న్మ‌ధుడు 2` డైరెక్ట‌ర్‌కి అగ్ని ప‌రీక్ష‌!

Last Updated on by

కింగ్ నాగార్జున కెరీర్ లో కొత్త డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేసి దెబ్బ తిన్న అనుభ‌వాలు చాలానే ఉన్నాయి. వీర‌భ‌ద్రంతో `భాయ్`, ఓంకార్ తో `రాజుగారి గ‌ది-2` , కిర‌ణ్ కుమార్ తో `కేడీ` తో స‌హా మ‌రెన్నో సినిమాలు కింగ్ కెరీర్ లో చేదు జ్ఞాప‌కాలుగా మిగిలాయి. ఏ హీరో అయినా ద‌ర్శ‌కుడిని న‌మ్మే సినిమా చేయాలి. కానీ కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా త‌ప్పిదాలు జరిగిపోతుంటాయి. వాటిని ప్ర‌తిసారీ ఎదుర్కొంటే ఇబ్బంది. మార్కెట్, ఇమేజ్ ఉన్నంత కాలం ఆ ప్లాప్ ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవస‌రం లేదు. కానీ ఆ రెండు డౌన్ అయితే? త‌ర్వాతి సినిమా పై క‌చ్చితంగా ఆ ప్ర‌భావం ఉంటుంది.

అందుకే ఇప్పుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ విష‌యంలో కింగ్ చాలా ప‌రీక్ష‌లు పెట్టాకే సెలెక్ట్ చేసాడ‌ని స‌మాచారం. నిన్న‌టి రోజున రాహుల్ ద‌ర్శ‌కత్వంలో మ‌న్మ‌ధుడు-2 ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందు రాహుల్ ను త‌న‌కు కొంత మంది ద‌ర్శ‌కులు ఇచ్చిన ప్లాప్ ల‌ను కింగ్ గుర్తు చేసార‌ట‌. ఆ స‌మయంలో ఆ ద‌ర్శ‌కులు చేసిన త‌ప్పుల‌ను త‌నకు స్ప‌ష్టంగా అర్థ‌మ‌య్యేలా వివ‌రించార‌ట‌. ఆ దారి మ‌న‌కొద్దు అంటే ఏదైనా కొత్త‌గా చేయాలి? చివ‌రిగా థియేట‌ర్ కు వ‌చ్చిన ప్రేక్ష‌కుడిని పూర్తిగా క‌న్విన్స్ చేయ‌గ‌ల‌గాలి. ఆ విష‌యంలో పూర్తి స్వేచ్చ ఇస్తాను? ఎంత టైమ్ అయినా తీసుకుని సినిమా చేద్దామ‌ని మ‌రోసారి విష‌యాన్ని గుర్తు చేసాడుట‌. అంటే రాహుల్‌కి ఈ ప్ర‌య‌త్నం స‌వాల్ తో కూడుకున్న‌దే. పైగా కెరీర్ ద్వితీయ విఘ్నం అధిగ‌మించాల్సి ఉంటుంది కాబ‌ట్టి క‌త్తి మీద సాములాంటిందే. అస‌లే నాగార్జున‌కు `సొగ్గాడే చిన్ని నాయానా` త‌ర్వాత స‌రైన సోలో స‌క్సెస్ రాలేదు. ఇప్పుడా బాధ్య‌త పూర్తిగా రాహుల్ పైనే ఉంది.

User Comments