సుశాంత్‌కి కింగ్‌ స‌ర్టిఫికెట్‌

Last Updated on by

చి.ల‌.సౌ చూశాక మావ‌య్య (నాగ్‌) అమ్మ‌(సుశీల‌)కు ఫోన్ చేసి సుశాంత్‌కు సూట‌య్యే సినిమా చేశాడు. ఇలా చేస్తూ వెళితే కెరీర్ బావుంటుంది అని అన్నారు. ఆయ‌న‌లా అన‌డ‌మే పెద్ద స‌ర్టిఫికెట్‌. నాకు, మా టీమ్‌కు గ‌ర్వ‌కార‌ణ‌మిది అని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు సుశాంత్‌. కొత్త క‌థ‌ల్లో న‌టించాల‌నుంద‌ని ఇదివ‌ర‌కూ చాలా సంద‌ర్భాల్లో చెప్పాను. అలాంటి కొత్త‌ద‌నం నిండిన సినిమా చేశాన‌ని తెలిపాడు. ఈ సినిమా చూశాక సుశాంత్ కొత్త‌గా ట్రై చేశాడ‌ని అంతా అంటారు. చైతూ, స‌మంత‌ల ఫీడ్‌బ్యాక్ త‌ర్వాత మావ‌య్య (నాగార్జున‌) ఈ సినిమా చూసి బావుంద‌ని ప్ర‌శంసించారు. ఆయ‌న అలా అన‌డం ఆనందాన్నిచ్చింది.. అన్నారు.

సుశాంత్‌, రుహని శర్మ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరుని సినీ కార్పొరేషన్ ప‌తాకంపై రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో జస్వంత్‌ నడిపల్లి, భరత్‌కుమార్‌ మలశాల, హరి పులిజల నిర్మించిన చిత్రం చి.ల‌.సౌ ఆగస్ట్‌ 3న రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భ ంగా అన్న‌పూర్ణ ఏడెక‌రాల్లో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో సుశాంత్ పైవిధంగా స్ప ందించారు.

ఈ సినిమాకి ఆరంభం “చిరంజీవి అర్జున్“ అనే టైటిల్‌ అనుకున్నాం. కానీ అదే స‌మ‌యంలో అర్జున్ రెడ్డి రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌డంతో మ‌ళ్లీ అర్జున్ టైటిల్ పెడితే అంచ‌నాలు వేరేగా ఉంటాయ‌నిపించింది. ఆ క్ర‌మంలోనే చి.ల‌.సౌ టైటిల్‌ని ఫిక్స్ చేశాం. వెన్నెల కిషోర్ ఈ టైటిల్‌ని సూచించారని తెలిపాడు. గ‌తంలో ర‌క‌ర‌కాల విష‌యాల‌కు ప్ర‌భావితం అయ్యేవాడిని. కానీ త‌ప్పో.. ఒప్పో సొంత నిర్ణ‌య‌మే మేల‌ని భావించి ఈ సినిమాని ఎంపిక చేసుకున్నా. ఎంపిక‌ల విష‌యంలో మావ‌య్య కూడా అదే క‌రెక్ట్ అని అన్నారని వెల్ల‌డించాడు.

User Comments