అత‌డు-ఆయ‌న మ‌ధ్య‌లో ఛార్మి

Last Updated on by

ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు కింగ్ మేక‌ర్స్ ఉంటారు. ఎలాంటి డీల్‌ని అయినా స‌మ‌ర్థంగా పూర్తి చేసే స‌త్తా వీళ్ల‌కు ఉంటుంది. డీల్ సెట్ట‌ర్‌.. సెటిల్‌మెంట్ కింగ్స్‌, డీలింగ్‌ క్వీన్స్ అంటూ వీళ్ల గురించి చెప్పుకోవ‌చ్చు. కొద్దో గొప్పో నేము-ఫేము ఉంటే ఇక్క‌డ అసాధార‌ణ డీల్స్‌ని చిటికెలో పూర్తి చేసేయొచ్చు. ప‌రిశ్ర‌మ‌లో ఇలాంటి వాళ్లు అరుదుగానే ఉన్నారు. ఇప్పుడు అలాంటి పాత్ర‌లోకి అందాల ఛార్మి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది.

గ‌త కొంత‌కాలంగా పూరి క‌నెక్ట్స్ ఎండీగా ఎన్నో డీల్స్ సెటిల్ చేస్తున్న ఛార్మి.. ఈసారి ఓ పెద్ద డీల్‌నే తెలివిగా హ్యాండిల్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల వ‌రస ప‌రాజ‌కాయ‌ల‌తో ఇబ్బందిక‌ర ఫ‌లితాన్ని అందుకుంటున్న పూరి జ‌గ‌న్నాథ్ కెరీర్‌కి సంబంధించిన ఓ కీల‌క డీల్‌ని ఛార్మి పూర్తి చేసింద‌ని తెలుస్తోంది. `మెహ‌బూబా` ఫ్లాప్ అయ్యాక పూరీకి అవ‌కాశాలిచ్చేదెవ‌రు? అని వెతుకుతుంటే.. తెలివిగా ప్ర‌స్తుతం కింగ్ నాగార్జున‌తో మంత‌నాలు సాగిస్తున్నార‌ట‌. అందులో ఛార్మి కీల‌క‌పాత్ర పోషించార‌ని, ఈ డీల్ ఆల్మోస్ట్ ఫైన‌ల్ అయ్యింద‌ని చెబుతున్నారు. కింగ్‌తో పూరి ఇదివ‌ర‌కూ సూప‌ర్‌, శివ‌మ‌ణి చిత్రాలు చేశారు. ఒక‌వేళ ఈ డీల్ పూర్త‌యితే ఈ కాంబోలో హ్యాట్రిక్ మూవీ వ‌స్తున్న‌ట్టే. ఇక‌పోతే ఈ ప్రాజెక్టున‌కు సంబంధించి అట్నుంచి అధికారికంగా ప్ర‌క‌టించాకే ఖాయం అనుకోవాలి.

User Comments