రామ్‌ని వెంటాడుతున్న షాడో

Last Updated on by

కిషోర్ తిరుమ‌ల తొలి సినిమా నేను శైల‌జ‌తోనే మంచి ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆయ‌న‌లో గొప్ప రైట‌ర్ ని ఆవిష్క‌రించిన చిత్ర‌మ‌ది. హిట్ కోసం దాహం మీదున్న రామ్ కి ఆ సినిమా మంచి ఎన‌ర్జీని ఇచ్చింది. అప్ప‌టికే వ‌రుస డిజాస్ల‌ర్టు. మార్కెట్ దాదాపు జీరోకి ప‌డిపోయే స్టేజ్ కి వ‌చ్చేసాడు. అదే టైమ్ లో శైల‌జ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు. ఆ కాన్పిడెన్స్ తోనే రామ్ రెండ‌వ సినిమా ఛాన్స్ కూడా కిషోర్ కే ఇచ్చాడు. అదే ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ. ఈ సినిమా యావ‌రేజ్ గా ఆడింది. భారీ లాభాలు తేలేక‌పోయినా న‌ష్టాలైతే తీసుకురాలేదు. ఆ వెంట‌నే మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ పిలిచి అవ‌కాశం ఇచ్చాడు. అప్ప‌టికీ పీక‌ల్లోతు ప్లాప్ ల‌తో సాయిధ‌ర‌మ్ కూరుకుపోయాడు.

ఆ నెక్స్ట్ ఏ ద‌ర్శ‌కుడితో చేసినా హిట్ త‌ప్ప‌నిస‌రి. అదే టైమ్ లో కిషోర్ వెళ్లి చిత్ర‌ల హ‌రి క‌థ చెప్ప‌డం….ఒకే చేసి సెట్స్ కు తీసుకెళ్ల‌డం జ‌రిగింది. ఇటీవ‌ల విడుద‌లైన‌ ఆ సినిమా బాగానే ఆడింది. సాయిధ‌ర‌మ్ కు కొంచెం ప్లాప్ ల నుంచి ఉప‌శ‌మ‌నం దొరికింది. ప్ర‌స్తుతం మ‌ళ్లీ బండిని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు. అయితే ప్లాప్ ల్లో ఉన్న హీరోల‌కు లిప్ట్ ఇచ్చినా కిషోర్ కు మాత్రం ఇంకా అత‌నికి త‌గ్గ హీరోలు దొర‌క‌డం లేదు. పెద్ద స్టార్లేవ‌రూ ఆయ‌నికి అవ‌కాశాలివ్వ‌డం లేదు. క‌నీసం శ‌ర్వానంద్, నితిన్ రేంజ్ హీరోలు కూడా కిషోర్ కు దొర‌క‌డం లేద‌ని తాజా స‌న్నివేశాన్ని బ‌ట్టి తెలుస్తోంది.

మూడ‌వ‌సారి రామ్ తో సినిమా ప్లాన్ చేస్తున్న‌ట్లు లీకందింది. త‌మిళ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన `త‌థీమ్` ను రామ్ తో రీమేక్ చేయాలనుకుంటు న్నాడుట‌. అరుణ్ విజ‌య్ న‌టించిన ఈ రీమేక్ క‌థ‌ను ఇప్ప‌టికే రామ్ కు వినిపించి ఒకే చేయించుకున్నట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం రామ్ ఇస్మార్ట్ శంక‌ర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సిన‌మా పూర్త‌యిన వెంట‌నే త‌థీమ్ రీమేక్ సెట్స్ కు వెళ్ల‌నుంద‌ని…దీన్ని స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మించ‌నున్నారని తెలిసింది.