సీక్రెట్ గా స్టార్ హీరో కి శస్త్ర చికిత్స

కోలీవుడ్ లో రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న బడా హీరో అజిత్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ గా వివేగం సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అజిత్.. యావరేజ్ సినిమాతో కూడా భారీ హిట్ కొడుతూ తన స్టామినా చూపిస్తున్నాడు.

ఇదే సమయంలో సినిమా కోసం రియల్ స్టంట్స్ చేస్తూ అజిత్ తన రియల్ పవర్ చూపిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే చాలాసార్లు గాయాల బారిన పడ్డ అజిత్.. ఇప్పటికీ అవేమీ పట్టించుకోకుండా సినిమా షూటింగ్ లో ఎలాంటి యాక్షన్ స్టంట్స్ అయినా డూప్ లేకుండా తానే చేసేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఇటీవల తన వివేగం సినిమా కోసం బల్గేరియాలో ఫైటింగ్ సీన్స్ తీసేటప్పుడు కూడా ఇలానే చేస్తే.. అజిత్ భుజానికి బలమైన గాయం అయిందని సమాచారం.

ఆ టైమ్ లో అక్కడ ప్రథమ చికిత్స చేయించుకుని వెంటనే షూటింగ్ లో పాల్గొన్నాడని తెలుస్తోంది. అదే సమయంలో నెలలోపు శస్త్ర చికిత్స చేయించుకోవాలని అజిత్ కు అక్కడి వైద్యులు సూచించారట. అందుకే తాజాగా చెన్నైలో అజిత్ కు శస్త్ర చికిత్స జరిగినట్లు తాజా సమాచారం.

ఈ మేరకు దీనికి సంబంధించిన ఆపరేషన్ ను చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో పెద్దగా హడావుడి లేకుండా సీక్రెట్ గా చేసేశారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని అంటున్నారు.

 అయితే, అజిత్ రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెన్నై డాక్టర్లు సూచించారట. ఏదిఏమైనా, అజిత్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు కోలీవుడ్ మీడియా చెబుతోంది. ఇకపోతే, గతంలో సొంతంగా ఫైట్ సీన్స్ చేస్తూ చిన్న చిన్న శస్త్ర చికిత్సలు అజిత్ చాలాసార్లు చేయించుకున్న విషయం తెలిసే ఉంటుంది.

Follow US