ఓన్లీ మెగాస్టార్ కోస‌మేన‌ట‌!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సార‌థ్యంలోని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ ప‌తాకంపై ఇత‌ర హీరోల‌కు సినిమాలు ఉంటాయా? ఈ ధ‌ర్మ సందేహానికి రామ్‌చ‌ర‌ణ్ నుంచి ఆస‌క్తిక‌ర స‌మాధానం వ‌చ్చింది. విన‌య విధేయ రామ ఇంట‌ర్వ్యూలో చ‌ర‌ణ్ మాట్లాడుతూ అస‌లు ఈ బ్యాన‌ర్ లో వేరే హీరోల‌తో సినిమాలు చేయ‌న‌ని తెలిపారు. ఇత‌ర హీరోల‌తో సినిమాలు తీసే ఆలోచ‌న లేదు. అది కేవ‌లం నాన్న‌(చిరు) గారికోసం మాత్ర‌మేన‌ని అన్నారు. అంతేకాదు ఆ బ్యాన‌ర్ లో తాను కూడా న‌టించ‌బోన‌ని తెలిపారు. ఎందుకంటే త‌న‌కు కావాల్సినంత మంది నిర్మాత‌లు ఉండ‌గా సొంత బ్యాన‌ర్ లో ఎందుకు న‌టిస్తాన‌ని అన్నారు. ఇత‌రుల‌కే సినిమాలు చేస్తాన‌ని క్లారిటీనిచ్చారు.

మెగాస్టార్ కోసం సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో ఈ బ్యాన‌ర్ లో చ‌ర‌ణ్ సినిమాలు తీస్తారు.. అంత‌వ‌ర‌కే. ఇక‌పోతే చ‌ర‌ణ్ న‌టిస్తున్న `విన‌య విధేయ రామ` ఈనెల 11న రిలీజ‌వుతోంది. ఈ సినిమాకి లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారా? అని ప్ర‌శ్నిస్తే చ‌ర‌ణ్ అంతే ఆస‌క్తిక‌ర ఆన్స‌ర్ ఇచ్చారు. నిర్మాత లాభాల్లో వాటాలు తీసుకోను. ఒక‌వేళ వాటా కావాల‌నుకుంటే నిర్మాత‌తో స‌మానంగా పెట్టుబ‌డి పెడ‌తాను. అప్పుడే వాటా అడుగుతాన‌ని అన్నారు. దీనిని బ‌ట్టి దాన‌య్య నుంచి ఏ వాటా చ‌ర‌ణ్ కి అంద‌డం లేద‌ని అర్థ‌మ‌వుతోంది. అయినా మార్కెట్, బిజినెస్ అంటేనే త‌ల‌నొప్పి. అందుకే నాకు కావాల్సింది పారితోషికం రూపంలో ముందే తీసుకుంటాన‌ని చ‌ర‌ణ్ క్లారిటీనిచ్చారు. దీనిని బ‌ట్టి వీవీఆర్, ఆర్.ఆర్.ఆర్ విష‌యంలో చ‌ర‌ణ్ కి ఏ వాటా లేద‌ని భావించ‌వ‌చ్చు. ఇక కొర‌టాల‌- చిరు సినిమాలో తాను నిర్మాణ‌ భాగ‌స్వామిన‌ని చ‌ర‌ణ్ చెప్పారు.