కొర‌టాల వెన‌క సీక్రెట్ గూఢ‌చారి!

Last Updated on by

`మంత్రివ‌ర్యులు కేటీఆర్ సినిమా చూశాక నాకు ఫోన్ చేసి ప్ర‌శంసించారు. సినిమాలో మంచి మెసేజ్ ఉంది. ఒక సామాజిక అంశాన్ని స్ప‌ర్శించేప్పుడు ఏమాత్రం పొరపాటు జరిగినా అది డాక్యుమెంటరీ అయిపోతుంది. కానీ కమర్షియల్ అంశాల్ని, సామాజిక సందేశాన్ని అద్భుతంగా డీల్ చేశార‌ని అన్నారు. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్“ అని ఆనందం వ్య‌క్తం చేశారు కొర‌టాల శివ‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ ం వ‌హించిన `భరత్ అనే నేను` భారీ కమర్షియల్ హిట్ అందుకున్న సంద‌ర్భంగా ఈ మంగ‌ళ‌వారం పాత్రికేయుల‌తో ముచ్చ‌టిస్తూ పైవిధంగా స్ప ందించారు. ప్ర‌స్తుతం

ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లే ఏర్పాట్లలో ఉన్నాన‌ని తెలిపారు. మ‌రిన్ని సంగ‌తులు ముచ్చ‌టిస్తూ-“ సినిమా అనేది బిజినెస్ కాబట్టి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎంత డ‌బ్బు పెడుతున్నారు, సినిమా ఎంత మందికి చేరువ‌వుతోంది? ఎంత మొత్తం వెనక్కి వస్తుంది? అనే అంశాలను దృష్టిలో పెట్టుకునే సినిమా చేస్తాను“ అని తెలిపారు. జయప్రకాష్ నారాయణగారు సినిమాలు చూడటం చాలా తక్కువ. అలాంటిది ఆయన ఈ సినిమా చూసి నాకు ఫోన్ చేసి బాగుందని మెచ్చుకున్నారు. అది కూడ మర్చిపోలేని కాంప్లిమెంట్. ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ఇతర పార్టీల వాళ్ళు కూడ ఫోన్లు చేసి అభినందించారని కొర‌టాల తెలిపారు.

`భ‌ర‌త్ అనే నేను` సినిమా కోసం రాజకీయ నాయకులు ఎవరిదగ్గరైనా సలహాలు తీసుకున్నారా ? అన్న ప్ర‌శ్న‌కు.. సినిమాకు ముందు జయప్రకాష్ నారాయణగారిని కలిసి సామాజిక నేప‌థ్య ంలో సినిమా చేస్తున్నాను, సొసైటీలో మార్పులు రావాలంటే ఏం చేయాలి? అని అడిగాన‌ని తెలిపారు. లోకల్ గవర్నెన్స్‌ అంశాల గురించి చ‌ర్చించాన‌ని తెలిపారు. నేటి ఇంట‌ర్వ్యూలో కొర‌టాల ఇచ్చిన లీకుల్ని బ‌ట్టి, ఆయ‌న వెన‌క ఉన్న గూఢాచారి ఎవ‌రో అర్థ‌మైంది క‌దూ? మొత్తానికి లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయణ ఆయ‌న ఆద‌ర్శాల‌తో పార్టీని గెలిపించ‌లేక‌పోయినా కొర‌టాల క‌థ‌లోని భ‌ర‌త్ అనే సీఎంని గెలిపించార‌ని భావించ‌వ‌చ్చు.

User Comments