షాక్.. కొరటాలకు చిరాకు తెప్పిస్తున్న ప్రకాష్ రాజ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన కొరటాల శివ ఇప్పుడు వరుస బ్లాక్ బాస్టర్స్ తర్వాత మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబు తోనే ‘భరత్ అనే నేను’ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా, ఓ నటుడి కారణంగా ఈ షూటింగ్ కి బ్రేక్ లు పడుతూ వస్తున్నాయని తెలియడం ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారింది. ఆ స్టోరీలోకి వెళితే, బహుభాషా నటుడిగా పేరున్న మన సీనియర్ స్టార్ నటుడు ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారట. కొరటాల శివ కూడా తొలిసారి తన సినిమాకు ప్రకాష్ రాజ్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ ను తీసుకోవడంతో ముందు చాలా హ్యాపీగా ఫీలయ్యారట.
కానీ, తీరా షూటింగ్ మొదలయ్యాక ప్రకాష్ రాజ్ వ్యవహార శైలి కొత్తగా ఉండటంతో కొరటాల తో పాటు యూనిట్ మొత్తం ఇబ్బంది పడుతుందని సమాచారం. ముఖ్యంగా షెడ్యూల్ ప్రకారం ప్రకాష్ రాజ్ షూటింగ్ కు రాకపోవడమే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుందని ఇన్నర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే రీసెంట్ ఈ సినిమా షూటింగ్ లో కొన్నిసార్లు ఒక్క షాట్ కూడా తీయకుండానే కొరటాల ప్యాకప్ చెప్పేశారని అంటుండటం షాకింగ్ న్యూస్ అవుతుంది.
దీంతో ఇప్పుడు కొరటాల శివకు చిరాకు వచ్చి ప్రకాష్ రాజ్ స్థానంలో వేరే ఎవరినైనా తీసుకుంటే బెటర్ అనే ఆలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, ప్రకాష్ రాజ్ ఇంతకుముందు కూడా కొన్ని సినిమాల విషయంలో ఇలానే చేసిన విషయం తెలిసే ఉంటుంది. ఓ సమయంలో అందుకే టాలీవుడ్ ఆయనపై నిషేధం కూడా విధించిందని అంటారు. మరి ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్రవర్తనతో.. మహేష్ సినిమాకు నష్టం వస్తుందో లేక ఆయనే చిక్కుల్లో పడతారో చూడాలి. ఇకపోతే, మహేష్ పొలిటికల్ లీడర్ గా నటిస్తోన్న ఈ ‘భరత్ అనే నేను’ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. దర్శక నిర్మాతలు సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోన్న విషయం తెలిసిందే.