కొరటాల శివకే ఎందుకు ఇలా జరుగుతుంది..

ఓ సినిమా అందంగా రావాలంటే ద‌ర్శ‌కుడు మాత్ర‌మే క‌ష్ట‌ప‌డితే స‌రిపోదు.. ఆయ‌న‌తో పాటు సినిమాటోగ్రాఫర్ కూడా క‌ష్ట‌ప‌డాలి. ద‌ర్శ‌కుడికి, కెమెరా మెన్ కు సింక్ ఉంటేనే సినిమా అందంగా వ‌స్తుంది. లేదంటే అంతే సంగ‌తులు. అందుకే ద‌ర్శ‌కుడికి ఎంత గౌర‌వం ఇస్తారో.. సినిమాటోగ్రాఫర్ ను అదే స్థాయిలో పొగిడేస్తుంటారు మ‌న హీరోలు. అలాంటి సినిమాటోగ్రాఫర్స్ ఈ మ‌ధ్య మ‌న ద‌ర్శ‌కుల తీరుతో చాలా హ‌ర్ట్ అవుతున్నారు. పెద్ద సినిమాల నుంచి కూడా మ‌ధ్య‌లోనే వెళ్లిపోతున్నారు. తాజాగా భ‌ర‌త్ అనే నేను నుంచి సినిమాటోగ్రాఫర్ ర‌వి కే చంద్ర‌న్ బ‌య‌టికి వెళ్లిన‌ట్లు తెలుస్తుంది. మ‌హేశ్ హీరోగా కొర‌టాల తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో కైరా అద్వాని హీరోయిన్.

KOratala Siva Cinematographer Ravi k Chandran Ego Problems
కొర‌టాల‌, ర‌వి కే చంద్ర‌న్ మ‌ధ్య విభేదాలు రావ‌డం వ‌ల్లే ఆయ‌న స‌గం నుంచి బ‌య‌టికి వెళ్లిపోయాడ‌ని తెలుస్తుంది. ఈ స్థానంలో జ‌న‌తా గ్యారేజ్ ఫేమ్ తిరు వ‌చ్చి చేరుతున్నాడు. జ‌న‌తా గ్యారేజ్ టైమ్ లోనూ మ‌దితో గొడ‌వ వ‌చ్చి.. తిరును తీసుకొచ్చాడు కొర‌టాల శివ‌. జై ల‌వ‌కుశ టైమ్ లోను ఇలాగే సినిమాటోగ్రాఫర్ మార్పు జ‌రిగింది. ముందు ఈ చిత్రానికి పీకే ఫేమ్ ముర‌ళీధ‌ర‌న్ ను సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నారు. చివ‌రి నిమిషంలో ఆయ‌న్ని కాద‌ని ఛోటా కే నాయుడు సీన్ లోకి వ‌చ్చాడు. ఇక సైరా షూటింగ్ మొద‌ల‌వ్వ‌క ముందే ర‌వివ‌ర్మ‌న్ త‌ప్పుకుని.. ఆ స్థానంలోకి ర‌త్న‌వేలు వ‌చ్చాడు. అ..ఆ సినిమా టైమ్ లో ఇలాగే సినిమాటోగ్రాఫర్ మార్పు జ‌రిగింది. మొత్తానికి ద‌ర్శ‌కుల‌తో వ‌చ్చే చిన్న‌చిన్న ఇగోలే సినిమాటోగ్రాఫర్స్ ఇలా బ‌య‌టికి వెళ్లిపోవ‌డానికి కార‌ణాలు అని తెలుస్తుంది. మ‌రి వాటిని వీళ్లెప్పుడు ప‌రిష్క‌రించుకుంటారో..!

User Comments