శ్వేత‌బ‌సు ఇంత‌లోనే విడాకులు

`కొత్త బంగారు లోకం` ఫేం శ్వేతాబ‌సు ప్ర‌సాద్ భ‌ర్త నుంచి విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. 2018 లో త‌న స్నేహితుడు రోహిత్ మిట్ట‌ల్ ని వివాహ‌మాడిన శ్వేతా క‌నీసం ఏడాది అయినా గ‌డ‌వ‌క ముందే విడాకులు ప్ర‌క‌టించ‌డం హాట్ టాపిక్ గా మారింది. 2018 డిసెంబ‌ర్ 13న పూణేలో కొద్దిమంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఈ జంట వివాహం జ‌రిగింది. ఇంత‌లోనే కాపురంలో క‌ల‌త‌లు .. హ‌ఠాత్తుగా శ్వేత నుంచి విడాకుల ప్ర‌క‌ట‌న‌ రావ‌డం.. ఫ్యాన్స్ లో వైర‌ల్ టాపిక్ అవుతోంది. మాజీతో రీప్లేస్ చేయ‌లేని  తీపి గురుతులు ఉన్నాయ‌ని .. అత‌డు ఎల్ల‌పుడూ ఎన్ స్పిరేష‌న్ గా నిలుస్తాడ‌ని శ్వేత సోష‌ల్ మీడియాలో వ్యాఖ్యానించింది.

స‌రిగ్గా నాలుగేళ్ల క్రితం శ్వేతాబ‌సుపై వ్య‌భిచారం ఆరోప‌ణ‌ల అనంత‌రం త‌న కెరీర్ ఎంతో సందిగ్ధ‌త‌లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆ ఆరోప‌ణ‌ల త‌ర్వాత త‌న‌కు మోర‌ల్ స‌పోర్ట్ గా మాట్లాడుతూ ప‌లువురు తెలుగు హీరోలు అవకాశాలిస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ శ్వేతాకు అవ‌కాశాలు రాక‌పోవ‌డం ప‌లుమార్లు చ‌ర్చ‌కొచ్చింది.