కౌస‌ల్య కృష్ణమూర్తి వ‌ర‌ల్డ్‌వైడ్ వోన్ రిలీజ్

ఐశ్వ‌ర్య రాజేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన కౌస‌ల్య కృష్ణ మూర్తి ఈనెల 23న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. క్రికెట్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్ర‌మిది. త‌మిళ్ లో పాపుల‌ర్ న‌టి ఐశ్వ‌ర్య రాజేష్ న‌టించిన సినిమా కావ‌డంతో ఓ వ‌ర్గం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగానే ఎదురు చూస్తున్నారు. మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నిర్మాత కె.ఎస్ రామారావు సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చారు. త‌న స‌క్సెస్ కార‌ణం కేవ‌లం క‌థ‌లేనేన‌ని, అలాంటి క‌థ‌లు ఎంపిక చేసుకోవ‌డం కోసం చాలా స‌మయం ప‌డుతుందాన్నారు.

ఒక సినిమా క‌థ‌ను ఎంతో బ‌లంగా న‌మ్మి చేస్తాన‌న‌ని, ఇన్నాళ్లు అదే పంథాలో వెళ్లాన‌న‌ని, కౌస‌ల్య కృష్ణ మూర్తి కూడా ఎంతో న‌మ్మి చేసిన క‌థ అని తెలిపారు. వ‌ర‌ల్డ్ వైడ్ గా సినిమాని తానే స్వ‌యంగా రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఔట్‌పుట్‌పై త‌న‌కున్న న‌మ్మ‌కంతోనే ఈ డేరింగ్ నిర్ణ‌యం తీసుకున్నాన‌న్నారు. వాస్త‌వానికి కొన్ని ఏరియాల్లో అమ్మాల‌ని ప్ర‌య‌త్న‌లు చేసారుట‌. కానీ పంపిణీదారులు వెన‌క్కి త‌గ్గ‌డంతో  తానే బ‌రిలోకి దిగాన‌న్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సినిమా అనేది క‌త్తి మీద సాము అని, కానీ అనుభ‌వం ఉంది కాబ‌ట్టి అన్నీ త‌ట్టుకుని నిల‌బ‌డుతున్నాన‌ని తెలిపారు. న‌ట‌కిరీటి డా.రాజేంద్ర ప్ర‌సాద్ ఓ కీల‌క పాత్ర పోషించిన ఈ చిత్రానికి సీనియ‌ర్ ద‌ర్శ‌కులు భీమ‌నేని శ్రీ‌నివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.