బిగ్ బాస్ కి కౌశల్ క్లీన్ చీట్..లేడీస్ ఫైర్

బిగ్ బాస్-3పై లైంగిక ఆరోప‌ణ‌లు మిన్నంటుతోన్న సంగ‌తి తెలిసిందే. హైకోర్టు తాత్కిలికంగా ఊర‌ట నిచ్చినా..కాస్టింగ్ కౌచ్ అంశం కాబ‌ట్టి అంత తొంద‌గ‌రా తెగే అంశం కాదు. ఈనెల 24న త‌దుప‌రి విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో శ్వేతారెడ్డి, గాయ‌త్రి గుప్తా, కేతిరెడ్డి ఆధారాలు సేక‌రించే ప‌నిలోప‌డ్డారు. అటు బిగ్ బాస్ నిర్వాహ‌కులు ఎలాగైనా క్లీన్ చీట్ తో బ‌య‌ట‌కు రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కొద్ది సేప‌టి క్రిత‌మే బిగ్ బాస్ సీజ‌న్-2 విజేత కౌశ‌ల్ బిగ్ బాస్ కి క్లీన్ చీట్ ఇచ్చాడు. బిగ్ బాస్ -2 విజేత‌గా, ఓ సామాన్యుడిగా నాకు షోపై ఎంతో అవ‌గాహ‌న ఉంది. ఈ కార్య‌క్ర‌మంకు ఎంపిక చేసే ప్ర‌క్రియ ఎంతో నిజాయితీగా సాగుతుంది.

ఎలాంటి త‌ప్పుడు ప‌నులు జ‌ర‌గ‌వు. బిగ్ బాస్ సీజ‌న్-3లో పాల్గొనే వారంద‌కికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. దీంతో లేడీ నేటి జ‌నులు భ‌గ్గుమ‌న్నారు. లైంగిక దాడులు జ‌రుగుతోంది ఆడ‌వాళ్ల మీద‌. మ‌గ‌వాళ్ల మీద కాదు. ఆ విష‌యం తెలియ‌క‌పోతే? తెలుసుకుని మాట్లాడు. అంతేగాని ఇలా ఇష్టాను సారి మిడి మిడి జ్ఞానంతో మాట్లాడితే ట్రోలింగ్ త‌ప్ప‌దంటూ హెచ్చ‌రించారు. దేశ‌లో ప్ర‌తీ చోట ఆడ‌వాళ్లు ఎంతో స‌ఫ‌ర్ అవుతున్నారు. అదీ బిగ్ బాస్ లాంటి షోలో లైంగిక వేధింపులు లేవ‌న‌డం న‌మ్మ‌శ‌క్యంగా లేదంటూ కౌశ‌ల్ పై మ‌హిళా మ‌ణులు సీరియ‌స్ అయ్యారు.