Last Updated on by
అవే కళ్లు.. అదే ముక్కు.. ఈ మీసం .. కళ్లజోడు.. ఆ వార చూపు.. ఆ గెటప్.. వ్వాహ్! ఎవరీయన ఏఎన్నార్‌లా ఉన్నాడు? ఈ మాట నాగచైతన్య విషయంలో లేదు. కానీ సుమంత్ విషయంలో ఉంది.. చెక్ డీటెయిల్స్..
`మహానటి` సినిమా చూశాక ఒకే ఒక్క విమర్శ. సినిమా అంతా బావుంది కానీ, ఒకే ఒక్క పాత్ర విషయంలో నాగ్ అశ్విన్ తప్పు చేశారంటూ ఓ ప్రముఖ పత్రిక ఎడిటర్ కామెంట్ చేశారు. ఆ తప్పేంటి? అంటే అక్కినేని పాత్రలో నాగచైతన్య సూటయ్యినట్టు అనిపించలేదు అన్నది ఆయన కామెంట్. అయితే పరిమిత సన్నివేశాల్లో మాత్రమే కనిపించిన ఆ పాత్రలో నాగచైతన్య చాలా వరకూ ఎక్స్ప్రెషన్స్ ట్రై చేశాడు. తాతలా కనిపించాలని తపించాడు. కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే ఆ రూపం వంద శాతం యాప్ట్ కాలేదన్నది పలువురి విమర్శ.
అందుకే ఆ తప్పును క్రిష్ రిపీట్ చేయదల్చుకోలేదు. ఆ క్రమంలోనే `యన్.టి.ఆర్` బయోపిక్‌కి అక్కినేని కాంపౌండ్ నుంచి సుమంత్‌ని ఎంపిక చేసుకున్నారు. సుమంత్ ఆ గెటప్‌కి ఎంత సూటబుల్నో ఇదిగో ఈ ఫోటోనే చెబుతోంది. అచ్చు గుద్దినట్టే అదే ఎక్స్ప్రెషన్ తో అదరగొట్టేశాడని చెప్పాలి. తాతంటే సుమంత్‌కి, సుమంత్ అంటే తాతకు ఉన్న అవినాభావ సంబంధం అంతే గొప్పది. సుమంత్ తాతకు అత్యంత సన్నిహితుడు ఇతరులతో పోలిస్తే. అందుకే ఇంత గొప్పగా ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగాడు. ఇక తాత అక్కినేని మరణించే ముందు సుమంత్‌కి చేయాల్సినదంతా చేశారని చెబుతుంటారు. ఆస్తి పరంగానూ కూతురు కొడుకు సుమంత్‌కి దక్కాల్సినది దక్కేలా చేశారని, తాత మనసు అంత గొప్పదని అప్పట్లో చెప్పుకున్నారు. నేడు అక్కినేని జయంతి సందర్భంగా ఈ స్పెషల్ ట్రీట్‌ని ఇచ్చింది యన్.టి.ఆర్ చిత్ర బృందం.
User Comments