టీవీ సీరియ‌ళ్ల న‌ర‌కం ఆపుతాడా?

Last Updated on by

టీవీ సీరియ‌ల్ అంటే విసుక్కునేవాళ్లే ఎక్కువ‌. ఇదేం న‌స‌రా బాబూ! అంటూ ఆ న‌స భ‌రించ‌లేక చానెల్ క‌ట్టేసి వేరే వ్యాప‌కానికి వెళ్లిపోతుంటారు. ఆడాళ్లు చూసినంత ఓపిగ్గా మ‌గాళ్లు ఈ రోజుల్లో సీరియ‌ళ్లు చూడ‌డం అరుదు. అస‌లు సీరియ‌ళ్లు అంటే అత్తా కోడ‌ళ్ల త‌గాదానో, అత్త‌మీద కుట్ర చేసే కోడ‌లు క‌థ‌నో, లేదా కోడ‌లుపై కుట్ర చేసే అత్త క‌థ‌నో చూపిస్తుంటారు. అయితే ఈ ట్రెండ్‌కి చ‌ర‌మ‌గీతం పాడేందుకు ప్ర‌స్తుతం వెబ్ సిరీస్‌లు బ‌రిలో దిగాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్‌ల‌కు అంత‌కంత‌కు ఆద‌ర‌ణ పెరుగుతుందంటే దీన‌ర్థం మునుముందు టీవీ ప‌రిశ్ర‌మ‌కు థ్రెట్ త‌ప్ప‌ద‌నే.

ఇక ఇలాంటి వేళ టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ క్రిష్ ఓ టీవీసీరియ‌ల్‌ని నిర్మించ‌నున్నార‌ట‌. దానికి త‌నే క‌థ‌, క‌థ‌నం అన్నీ అందించారు. టైటిల్ ప‌ల్లెటూరి పిల్ల‌. వాస్త‌వానికి టీవీ ఇండ‌స్ట్రీ క్రిష్‌కి కొత్తేమీ కాదు. అత‌డి తండ్రి గారితో క‌లిసి చాలా కాలం నుంచి ఇది ఫాలో చేస్తున్న‌దే. ఈ రంగంలో విశేష అనుభ‌వం ఆయ‌న‌కు ఉంది. ఓవైపు పెద్ద తెర‌పై భారీ చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే ఇలా బుల్లితెర నిర్మాత‌గా డ‌బుల్ రోల్ పోషిస్తున్నారాయ‌న‌. ఈ బిజీ లైఫ్ అత‌డికి మాత్ర‌మే సాధ్యం. ఇక‌పోతే ప‌ల్లెటూరి పిల్ల సీరియ‌ల్ రెగ్యుల‌ర్ సీరియ‌ళ్ల‌కు దూరంగా ఉండ‌డ‌మే కాకుండా మంచి క‌థ‌తో ఆక‌ట్టుకుంటుందిట‌.

User Comments