క్రిష్‌కు మండిపోతోంది…ఎందుక‌నో…!

Last Updated on by

ద‌ర్శ‌కుడు క్రిష్‌కు మండిపోతోంది.. అస‌హ‌నంతో ఊగిపోతున్నాడ‌ట‌. ఉన్న‌ట్టుండి క్రిష్‌కు ఏమైంది. ఎందుకు ఊగిపోతున్నాడు… అంటే త‌ను రూపొందించిన `ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు`పై విమ‌ర్శ‌కులు, అభిమానులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు సోష‌ల్ మీడియా వేదిక‌గా విరుచుకుప‌డుతున్నారు. కొంత మంది మ‌రో అడుగు ముందుకేసి ఇందులో బాల‌కృష్ణ కంటే జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తే మ‌రింత ఊపు, క్రేజు వ‌చ్చేదని బాహాటంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో `ఎన్టీఆర్‌` బ‌యోపిక్‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల్ని గ‌మ‌నించిన క్రిష్‌కి తాజాగా చిర్రెత్తుకొచ్చింద‌ట‌. ప్ర‌తీవాడూ విమ‌ర్శించే వాడే..తీయ‌డం చేత‌కాని వాడు ఎన్నైనా చెబుతాడు. తీసేవాడికి ఆ విలువ ఏంటో తెలుస్తుంది. ఆ విలువ తెలియ‌ని వాళ్ల‌ను చూస్తే అస‌హ్యం వేస్తోంది అంటూ మండిప‌డుతున్నాడు. తొలి భాగం ఇప్పుడే క‌దా విడుద‌లైంది. అప్పుడే విమ‌ర్శ‌లు చేస్తే ఎలా రెండ‌వ భాగం వ‌చ్చే వ‌ర‌కు ఎదురుచూడండి. దాన్ని చూసిన త‌రువాత అప్పుడు మాట్లాడండి అంటూ విమ‌ర్శ‌కుల‌కు, సినీ విమ‌ర్శ‌కుల‌కు క్రిష్ చుర‌క‌లంటిస్తున్నారు. `ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు` వ‌చ్చే నెల 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌రువాత విమ‌ర్శ‌కులు మ‌రింత‌గా రెచ్చిపోవ‌డం ఖాయం. ఎందుకంటే ఇందులో ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితాన్ని అసంపూర్తిగానే ముంగించార‌ట‌. మ‌రి దీనిపై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌కు క్రిష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

User Comments