క్రిష్ క‌మ‌ర్శియ‌ల్ స్టోరీతోనా?

ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్ క‌మ‌ర్శియ‌ల్ స్టోరీల వైపు ఆస‌క్తి చూపిస్తున్నాడా? రొటీన్ కు భిన్నంగా ఉండే త‌న ఆలోచ‌న‌ల‌ను ప‌క్క‌న‌బెట్టాడా? క‌మ‌ర్శియ‌ల్ డైరెక్ట‌ర్ గా ప్రూవ్ చేసుకోవాల‌ని మొండి ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి. క్రిష్ ఐడియాలిజం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. యూనిక్ గా థింక్ చేసే ఫిల్మ్ మేక‌ర్. ఆయ‌న చేసిన సినిమాల‌కు క‌మ‌ర్శియ‌ల్ గా స‌క్సెస్ కాక‌పోవ‌చ్చు. కానీ ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఐడెంటీని తీసుకొచ్చింది ఆ సినిమాలే. అయితే నిర్మాత కోణంలో ఆలోచిస్తే క్రిష్ థాట్స్ వ‌ర్కౌట్ కావ‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. అందుకే దేవ‌క‌ట్టా లాంటి ఫిలిం మేక‌ర్ టాలీవుడ్ లో వ‌ర్కౌట్ కాద‌ని బాలీవుడ్ కు వెళ్లిపోయాడు. వీళ్ల త‌ర‌హాలో ఆలోచించే ప్ర‌వీణ్ స‌త్తారు కూడా తన ఫంథా మార్చుకున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా క్రిష్ కూడా ప్ర‌వీణ్ స‌త్తారు బాట‌నే ఎంచుకున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌ల బాల‌కృష్ణ‌తో తెర‌కెక్కించిన `క‌థానాయ‌కుడు`, `మ‌హానాయ‌కుడు` ఎలాంటి ఫ‌లితాలు సాధించాయో తెలిసిందే. ప్ర‌శంస‌ల‌కు బ‌ధులు విమ‌ర్శ‌ల‌ను మోయాల్సి వ‌చ్చింది. ఓ మ‌హానీయుడి క‌థ‌ను ఇలా ఎలా చేసాడంటూ విమర్శ‌లు ఫేస్ చేసాడు. మ‌రి ఇది రియ‌లైజేష‌నో? మ‌రొక‌టో తెలియ‌దు గానీ క్రిష్ క‌మ‌ర్శియ‌ల్ సినిమా చేయ‌డం అన్న‌ది అంత‌టా చ‌ర్చకొస్తుంది. స‌రైన క‌మ‌ర్శియ‌ల్ సినిమా చేసి క్రిటిక్స్ నోళ్లు మూయించాల‌ని భావిస్తున్నాడుట‌. సొంత బ్యాన‌ర్లోనే సినిమా ప్లాన్ చేస్తున్నాడుట‌. మ‌రి ఇందులో నిజ‌మెంత‌? అన్న‌ది క్రిష్ లైన్ లోకి వ‌స్తే గానీ తెలియదు.