క్రియేటివ్ డైరెక్ట‌ర్ లెగ‌సీ?

Last Updated on by

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ కెరీర్ ప్ర‌స్తుతం డైల‌మాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భ కోల్పోయిన ఈ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు బౌన్స్ బ్యాక్ అయ్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఎందుక‌నో ఏదీ కుద‌ర‌డం లేదు. గోవిందుడు అంద‌రివాడేలే ఊహించ‌ని ఫ‌లితాన్ని ఇవ్వ‌డంతో అనుకున్న అడుగుప‌డ‌లేదు. ఆ క్ర‌మంలోనే బాల‌య్య‌కు ఓ క‌థ చెప్పారు. కానీ అదీ వ‌ర్క‌వుట్ కాలేదు. ఆ సంగ‌తి అటుంచితే అగ్ర‌ద‌ర్శ‌కుడిగా కెరీర్ సాగించిన కృష్ణ‌వంశీ వ‌ద్ద శిష్య‌రికం చేసిన శ్రీ‌నివాస్
చ‌క్ర‌వ‌ర్తి బ‌రిలో దిగారు. శ్రీ‌నివాస్‌ డెబ్యూ సినిమాతో విజ‌యం సాధించి గురువుకు గురుద‌క్షిణ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు అటుపై కృష్ణ‌వంశీ లెగ‌సీని ముందుకు తీసుకెళతాడ‌నే భావిస్తున్నారు.
అదంతా అటుంచితే నాగ‌శౌర్య న‌ర్త‌న‌శాల‌తో శిష్యుడికి టెస్ట్ స్టార్ట‌యిన‌ట్టేన‌ని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. క్రియేటివ్ ద‌ర్శ‌కుడి శిష్యుడు సక్సెస‌వుతాడా? అంటూ ఒక‌టే ఇదిగా వెయిటింగ్‌. ఇక‌పోతే సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే టాకీ పూర్తి చేసి త‌ర్వాత జూలైలో పాట‌ల చిత్రీక‌ర‌ణ‌కు వెళ‌తార‌ట‌. ఇంత‌కీ శిష్య‌ర‌త్నం క్రియేటివ్‌గా తీస్తాడా? అంతందంగా ఫ్రేమ్‌లు చూపిస్తాడా?  న‌ర్త‌న‌శాల సినిమాని క‌ల‌ర్‌ఫుల్‌గా చూపిస్తాడా?  .. జ‌స్ట్ వెయిట్!

User Comments