బాల‌య్య‌ని వెంటాడుతున్న రైతు!

Last Updated on by

Last updated on March 11th, 2019 at 02:10 pm

న‌ట‌సింహా బాల‌కృష్ణ క‌థానాయకుడిగా ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ అప్ప‌ల్లో `రైతు` సినిమాను ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. బాల‌య్య 100వ సినిమాగా ప్లాన్ చేశారు. కానీ క్రిష్ `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి` క‌థ డామినేట్ చేసింది. ఆ క‌థ‌ను బాల‌య్య విన‌క‌పోయి ఉంటే! కచ్చితంగా రైతు ప‌ట్టాలెక్కేది. అప్ప‌టికే బాల‌య్య బాలీవుడ్ లెజెండ‌రీ అమితాబ‌చ్చ‌న్ తో అందులో కీల‌క పాత్ర చేయించాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు కూడా చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ బిగ్ బీ ఆ ఆఫ‌ర్ ని సున్నితంగా తిర‌స్క‌రించ‌డం…అటుపై బాల‌య్య ఆయ‌న‌పై  పొలిటిక‌ల్ పంచ్ లు వేయ‌డం జ‌రిగింది. ఇదంతా గ‌తం. మరి ప్ర‌స్తుతం `రైతు` ప‌రిస్థితి ఏంటి? అంటే ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది.

తాజాగా మ‌రోసారి కృష్ణ‌వంశీ `రైతు` క‌థ‌తో బాల‌య్య‌ను అప్రోచ్ అయ్యాడని స‌మాచారం. బాల‌య్య ఆల్రెడీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన నేప‌థ్యంలో మ‌రోసారి చేద్దామ‌నే మాటిచ్చారుట‌. మ‌రి బోయ‌పాటికి శ్రీను కంటే ముందుగా కృష్ణ‌వంశీతోనే చేయోచ్చు! క‌దా అని ఓ ప్ర‌శ్న రెయిజ్ అవుతోంది. అయితే ప్ర‌స్తుతం బాల‌య్య  ఉన్న ప‌రిస్థితుల్లో కృష్ణ‌వంశీతో రిస్క్ తీసుకోలేరు. ఇటీవ‌ల విడుద‌లైన‌ `క‌థానాయ‌కుడు`, `మ‌హానాయ‌కుడు` అంచ‌నాలు అందుకోవ‌డం లో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాయి. బాల‌య్య‌కి ఇప్పుడు స‌క్సెస్ అనివార్యం.  బోయ‌పాటి బాయ్య‌కు ఇచ్చిన ప్రీవియ‌స్ స‌క్సెస్ ల‌ను బ‌ట్టి ఆ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ అయితేనే అంచ‌నాలు ఆ రేంజ్ లో ఉంటాయి. పైగా అభిమానుల నుంచి  సైతం ఒత్తిడి ఉంది. వీట‌న్నింటికి మించి బోయ‌పాటిక‌న్నా కృష్ణ‌వంశీ కే ఫ్లాప్ లు ఎక్కువ‌గా  ఉన్నాయి. అందుకే బాల‌య్య  ముందుగా బోయ‌పాటికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ని తెలుస్తోంది

Also Read: NBK-Boyapati Looking For A Bakra

User Comments