ఒక్క సూపుతో అట్ట సంప‌కే..!

Last Updated on by

కృతిస‌న‌న్.. పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ప‌రిచ‌యం ఉన్న పేరే. మ‌హేష్ బాబు నేనొక్క‌డినేలో న‌టించి.. ఆ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో దోచేయ్ లో అందాలు ఆర‌బోసింది ఈ బ్యూటీ. ఆ త‌ర్వాత పూర్తిగా బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. అక్క‌డ ఇప్ప‌టికీ ఉనికి కోసం పాట్లు ప‌డుతూనే ఉంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. బ‌య‌టికి వ‌చ్చిన‌పుడు కూడా ఈ భామ అందాల ఆర‌బోత‌తో చంపేస్తుంది.

తాజాగా ముంబై వీధుల్లో తిరుగుతూ థైస్ చూపిస్తూ పిచ్చెక్కించింది. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ కెమెరాల‌కు ఫుల్ గా ప‌ని చెబుతోంది. ఈ అందాల ఆకృతి చూసి అబ్బో అనుకున్నారంతా. ప్ర‌స్తుతానికి ఉన్న ఒక‌ట్రెండు సినిమాల‌తోనే కాలం గ‌డిపేస్తుంది కృతి. పైగా ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ఈ మ‌ధ్య కాస్త విభేదాలు వ‌చ్చిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. దాంతో త‌న ప‌నుల్లో తాను బిజీ అయిపోయింది కృతి. మ‌రి.. ఈ భామ‌కు ఎన్నాళ్ల‌కు బాలీవుడ్ లో మంచి రోజులు వ‌స్తాయో.. ?

User Comments