జిరాఫీని మించిన జిరాఫీ

Last Updated on by

అవును.. ఈ ఫోటోలో రెండు జిరాఫీలు ఉన్నాయ్‌. క‌నిపెట్టండి చూద్దాం. ఒక జిరాఫీ మ‌నిషిలా క‌నిపిస్తుంది. రెండో జిరాఫీ ఒక పోత పోసిన బొమ్మ‌. ఈ మాట అంటోంది మేం కాదు. ఈ ఫోటో చూశాక నెటిజ‌నుల మెజారిటీ అభిప్రాయమిది. జిరాఫీని మించిన జిరాఫీ నువ్వు అంటూ ఒక‌టే సూటిపోటి మాట‌ల‌తో కృతి స‌నోన్‌పై చెల‌రేగిపోతున్నారు నెటిజ‌నులు.

ఒకావిడైతే.. వ్వాట్ ద హెల్ ఈజ్ దిస్‌? అంటూ తుక్కు రేగ్గొట్టింది. ఇదా పెటా వాళ్ల వ్య‌వ‌హారికం? అన్న తీరుగా ఆవిడ పెట్టిన చీవాట్లు న‌భూతోన‌భ‌విష్య‌తి. ఆట్రాసిటీ గురించి మీరేనా మాట్లాడేది? అంటూ ప‌ళ్లు ఊడ‌గొట్టింది. ఆవిడ పేరు అనూరాధా తుల‌సి. ఆవిడ చేతులెత్తాలంటే బ్యాక్‌గ్రౌండ్‌లో జిరాపీ వేలాడాలా? జ‌ంతుజాతికి సంబంధించిన బేసిక్ రైట్స్‌ని ఇలానేనా కాపాడేది అంటూ మూతి వాయ‌గొట్టారు. ఇది బ‌తికి ఉన్న ఒరిజిన‌ల్ జిరాఫీ కాక‌పోవ‌చ్చు. కానీ ప‌బ్లిక్‌ని ప్ర‌భావితం చేసే ఇలాంటి ఫోటోషూట్లు అలాంటి చెత్త స‌బ్జెక్ట్‌తో ఎలా డిజైన్ చేస్తారు? అన్న‌ది ఆవిడ మీనింగ్ అన్న‌మాట‌! మొత్తానికి కృతి స‌నోన్‌కి అలా తాట తీశారు నెటిజ‌నం.

User Comments