మెగాబాస్‌తో ఇప్పటికిప్పుడే

Last Updated on by

మెగా నిర్మాత .. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అధినేత కె.ఎస్‌.రామారావు `తేజ్ .. ఐ ల‌వ్ యు` చిత్రాల త‌ర్వాత చేసే సినిమాలేవి? అంటే ఇదిగో ఇదే స‌మాధానం. ఆయ‌న పెద్ద రేంజులోనే స్కెచ్ వేశాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌- క్రాంతి మాధ‌వ్ కాంబినేష‌న్ సినిమా త‌ర్వాత ఆ వెంట‌నే రామ్‌చ‌ర‌ణ్‌, మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

`తేజ్ ఐ ల‌వ్ యు` జూలై 6న రిలీజ‌వుతున్న వేళ ప్ర‌మోష‌న్స్‌లో మాట్లాడిన కె.ఎస్‌.రామారావు ఆస‌క్తిక‌ర సంగ‌తులే చెప్పారు. సాయిధ‌ర‌మ్ క్ర‌మ‌శిక్ష‌ణ ఉన్న హీరో. ఆ కుటుంబ (మెగా) హీరో అన‌గానే క్ర‌మ‌శిక్ష‌ణ ఆటోమెటిగ్గానే ఉంటుంది. షూటింగ్ హైద‌రాబాద్‌లో అయినా, విదేశాల్లో అయినా స‌మ‌యానికి వ‌చ్చి శ్ర‌మించ‌డం త‌న అల‌వాటు. చిరంజీవి నుంచి వ‌చ్చిన మంచి క్ర‌మ‌శిక్ష‌ణ ఇది. ఇక చిరంజీవిగారితో నా రిలేషన్ ఆ రోజుల్లో ఎలా ఉందో ఈ రోజుకి అలాగే ఉంది. ఎందుకంటే ఆయన నాకు ఎప్పటికీ మెగాస్టారే. ఆయన డేట్స్‌ ఇస్తే వెంటనే సినిమా మొదలుపెడతాను. ప్రస్తుతం మా బ్యాన‌ర్‌లో విజయ్‌ దేవరకొండ- క్రాంతిమాధవ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం ఉంది. అక్టోబర్‌లో ప్రారంభిస్తాం.. అని తెలిపారు.

User Comments