రీల్ సీఎంపై కేటీఆర్ ప్ర‌శంస‌

Last Updated on by

రీల్ సీఎంని కాబోయే రియ‌ల్ సీఎం తెగ పొగిడేశారు! స‌ద‌రు మంత్రి వ‌ర్యులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారంటే న‌మ్మండి!! అస‌లింతకీ ఎవ‌రాయ‌న‌? అంటే అంత‌గా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నే లేదు. తెలంగాణ ఉద్య‌మాన్ని వేడెక్కించిన యువ‌నేత‌గా … తెలంగాణ సాధ‌కుడిగా.. ఐదుకోట్ల ఆంధ్రుల‌కు, 4కోట్ల తెలంగాణ జ‌నుల‌కు అత‌డు బాగా సుప‌రిచితం. ఆయ‌నే కేటీఆర్‌.

లేటెస్టుగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్ చేస్తూ `భ‌ర‌త్ అనే నేను` టీమ్‌ని ఆకాశానికెత్తేశారు.“ప‌బ్లిక్ లైఫ్‌పై మ‌హేష్ – కొర‌టాల బృందం తీసిన `భ‌ర‌త్ అనే నేను` సినిమా బాగా న‌చ్చింది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై తీసిన ఈ సినిమాని ప‌ర్స‌న‌ల్‌గా ఎంతో బాగా ఎంజాయ్ చేశాను“ అని పొగిడేశారు. మ‌హేష్ – కొర‌టాల‌- దాన‌య్య టీమ్ ఆహ్వానం మేర‌కు ప్రివ్యూ వీక్షించిన కేటీఆర్ ఇలా ప్ర‌శంసించడంపై అభిమానుల్లోనూ హ‌ర్షం వ్య‌క్త‌మైంది. ఈ ఆనందంలో `కేటీఆర్ అనే నేను` తెర‌కెక్కించాల్సిందిగా అభిమానులు ట్విట్ట‌ర్‌లో కోరారు. తార‌క‌రామారావు కూడా సీఎం భ‌ర‌త్‌లానే చేస్తున్నాడంటూ ఓ వీరాభిమాని ట్వీట్ చేయ‌డం ఆస‌క్తి రేకెత్తించింది. మొత్తానికి ఈ ట్వీట్లు చూశాక.. కొరటాల నిజంగానే `కేటీఆర్ అనే నేను` తీస్తే ఎలా ఉంటుంది? అన్న సంద‌హం క‌లిగింది.

User Comments