మెగా హీరోల‌కు ఆమె క‌లిసిరాలేదా..?

ఒక్క సినిమా తేడా కొట్ట‌గానే ఇప్పుడిప్పుడే ఫ్యాన్స్ ఫీలింగ్ తో పాటు ఇండ‌స్ట్రీలో ఉన్న సెంటిమెంట్స్ కూడా బ‌య‌టికి వ‌స్తున్నాయి. అజ్ఞాత‌వాసికి ఊహించ‌ని విధంగా నెగిటివ్ టాక్ వ‌చ్చేసింది. ఈ చిత్రం ప‌వ‌న్ కు 25వ సినిమా అయినా.. అది వీలైనంత త్వ‌ర‌గా మ‌రిచిపోయే సినిమా అయింది. అభిమానుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంది అజ్ఞాత‌వాసి. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి మ‌రో క‌లిసిరాని సెంటిమెంట్ కూడా బ‌య‌టికి వ‌చ్చింది. అదే ఖ‌ష్బూ సెంటిమెంట్.

ఖ‌ష్బూ మెగా హీరోల‌కు క‌లిసి రాలేదు. ప‌దేళ్ల కింద చిరంజీవితో ఈమె న‌టించిన స్టాలిన్ కూడా యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోయింది కానీ కోరిన విధంగా హిట్ మాత్రం కాలేదు. అందులో చిరుకు అక్క‌గా న‌టించింది ఖ‌ష్బూ. ఇప్పుడు ప‌వ‌న్ కు త‌ల్లిగా వ‌చ్చింది. అజ్ఞాతవాసిలో ఉన్నంత వ‌ర‌కు ఈమె బాగానే చేసింది కానీ క‌థే స‌హ‌క‌రించ‌లేదు. దాంతో మ‌రోసారి నిరాశ త‌ప్ప‌లేదు. దాంతో మెగా కుటుంబానికి ఖ‌ష్బూ క‌లిసి రాలేద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇది ఆమె కెరీర్ కే ఇక్క‌డ ప్రమాద‌క‌రం. మ‌రి అజ్ఞాతవాసి ప‌య‌నం ఎలా ఉండ‌బోతుందో..?