సూర్య నిర్మాత పాట్లు, అగ‌చాట్లు

Last Updated on by

ఫ్యామిలీ ఎమోష‌న్స్ … దేశ‌భ‌క్తి  ప్ర‌ధానంగా తెర‌కెక్కించిన సినిమా ఇది. మూవీ చూసి సైనికుల‌కు సాయం చేయ‌డానికి, వాళ్ల కుటుంబాల‌కు అండ‌గా నిలిచేందుకు జ‌నం ముందుకొస్తారు“ అని అన్నారు ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్‌.
అల్లు అర్జున్ హీరోగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వ ంలో తెర‌కెక్కిన‌ `నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా` ఇటీవ‌ల విడుద‌లైంది. విజ‌యోత్స‌వ వేళ‌ నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ మాట్లాడుతూ పైవిధంగా స్ప ందించారు. ప‌నిలో ప‌నిగా రామాయ‌ణం, మ‌హాభార‌తం అర్థం కాని వారికి కూడా సినిమా క‌నెక్ట‌వుతుంద‌ని, నా పేరు సూర్య త‌ప్ప‌క చూడాల‌ని ల‌గ‌డ‌పాటి ప్ర‌వ‌చించారు.
ఆయ‌న మ‌రిన్ని సంగ‌తులు మాట్లాడుతూ “క‌థ విన్న‌ప్పుడు, ప్రొడ‌క్ష‌న్ చూసుకున్న‌ప్పుడు విజ‌యం సాధిస్తుంద‌నిపించింది. ఆశించిన‌ స్థాయి విజ‌యం సాధించింద‌ని అభిమానుల స‌మ‌క్షంలో చూశాక అర్థ‌మైంది. అల్లు అర్జున్ మంచి క‌థ‌ను గుర్తించి చేశారు. ఊహాతీత‌మైన‌ సినిమా ఇది. రోజూ 5 సినిమాలు చూసి నిద్ర‌పోయే నేను ఈ సినిమాను చూసి చాలా స్ఫూర్తి పొందాను. తొలి నుంచి మా సినిమా జ‌నంపై ప్ర‌భావం చూపించింది. ట్రైల‌ర్‌, పోస్ట‌ర్ అంద‌రికీ న‌చ్చాయి. అంతిమంగా సినిమా మంచి విజ‌యం అందుకుంది. తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు, మ‌ల‌యాళం, త‌మిళ్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది. త‌మిళంలో తొలిసారి బ‌న్నీ సినిమా అనువాద‌మై రిలీజైంది. మ‌ల‌యాళంలో 400 థియేట‌ర్లు ఉంటే, 100కి పైగా థియేట‌ర్ల‌లో సినిమా రిలీజైంది. అన్నిచోట్లా అంద‌రికీ న‌చ్చింది. మూవీలో మ‌ల్టిపుల్ కాంప్లెక్స్ అనే పాయింట్ ముఖ్యంగా ఆక‌ట్టుకుంటోంది.  ఇల్లు శుభ్రం చేసుకుంటే ఎంత బావుంటుందో ఇలాంటి సినిమా చూసిన‌ప్పుడు మ‌న‌సు అంత ప్ర‌శాంతంగా ఉంటుంది.“ అన్నారు. తొలిరోజు ఈ సినిమా 45కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింద‌ని ల‌గ‌డ‌పాటి వెల్ల‌డించారు. అన్న‌ట్టు ల‌గ‌డ‌పాటి ప్రెస్‌మీట్ ఆద్య ంతం రామాయ‌ణం, మ‌హాభార‌తం అంటూ బోలెడంత వినోదం పంచారు. అస‌లు సూర్య‌కు రామాయ‌ణానికి, భార‌తానికి సంబంధం ఏంటి?  ఓవైపు సూర్య‌కు బ‌య‌ట డివైడ్ టాక్ న‌డుస్తున్నా.. దానిని క‌వ‌ర్ చేసేందుకా అన్న‌ట్టు స‌ద‌రు నిర్మాత ప‌డిన పాట్లు అగ‌చాట్లు అలా బ‌య‌ట‌ప‌డ్డాయంటూ అంతా మాట్లాడుకోవ‌డం కొస‌మెరుపు.

User Comments