అమెరికాలో `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` హవా

Last Updated on by

ఆర్జీవీ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ఏపీలో మిన‌హా అన్నిచోట్లా రిలీజైన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌, ఓవ‌ర్సీస్ లో ఈ సినిమా భారీగానే రిలీజైంది. తొలి రోజు ఈ సినిమాకి కూడా య‌థావిధిగా డివైడ్ టాక్ వ‌చ్చింది. అయితే వివాదాల‌తో వ‌చ్చిన ప్ర‌చారం వ‌ల్ల ఈ సినిమాకి ఓపెనింగ్స్ బావున్నాయ‌న్న రిపోర్ట్ ట్రేడ్ నుంచి వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల ఓపెనింగుల మాటేమో కానీ ఓవ‌ర్సీస్ నుంచి చ‌క్క‌ని రిపోర్ట్ అందింది.

ఈ సినిమా అమెరికాలో 118 లొకేష‌న్ల‌లో రిలీజై.. ప్రీమియ‌ర్ల రూపంలోనే 90కె డాల‌ర్లు వ‌సూలు చేసింద‌ని తెలుస్తోంది. ఇంచుమించు బాల‌య్య తెరకెక్కించిన `మ‌హానాయ‌కుడు` ప్రీమియ‌ర్ వ‌సూళ్ల (102కె డాల‌ర్లు) స్థాయిలో ఆర్జీవీ సినిమా వ‌సూలు చేయ‌డం ఆస‌క్తిక‌రం. ల‌క్ష్మీ పార్వ‌తి కోణంలో ఎన్టీఆర్ ని ఆర్జీవీని చూపించార‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. మ‌హాన‌టి చిత్రానికి 268 కె డాల‌ర్లు, క‌థానాయ‌కుడు చిత్రానికి 473 కె డాల‌ర్లు ద‌క్కాయి. ఓవ‌ర్సీస్ లో క‌థానాయ‌కుడు ప్రీమియ‌ర్ల‌లో ది బెస్ట్ గా నిలిచింది. ఇక అంత‌గా స్టార్ కాస్టింగ్ లేకుండానే ఆర్జీవీ బ్రాండ్ తో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి ఈ స్థాయి ఓపెనింగ్స్ ఓవ‌ర్సీస్ లో ద‌క్కాయంటే ఇది పెద్ద స‌క్సెస్ కిందే లెక్క అని విశ్లేషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు రిలీజైన సూర్య‌కాంతం చిత్రం 55 లొకేష‌న్ల నుంచి 6390 డాల‌ర్లు వ‌సూలు చేసింది. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ప్ర‌చారానికి అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నే ఉప‌యోగించేయ‌డంపైనా ఆసక్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

Also Read : Good Start For Lakshmi’s Ntr At Usa Box Office

User Comments