క‌డ‌పలో వ‌ర్మ వెన్నుపోటు ఈవెంట్

సంచ‌ల‌నాల వ‌ర్మ తెర‌కెక్కించిన `లక్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజ్ పై నెల‌కొన్న ఉత్కంఠ‌త‌కు తెర‌ప‌డింది. ఎన్నిక‌ల అధికారులు వ‌ర్మ కే ఓటేసారు. మార్చి 22న రిలీజ్ అయ్యే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ను అడ్డుకునే రైట్స్ త‌మ‌కు లేవంటూ రాష్ర్ట ఎన్నిక‌ల క‌మీష‌న్ తెగేసి చెప్పేసింది. ఎన్నిక‌ల కోడు అమ‌లులో ఉన్నా? సినిమాలో ఎలాంటి వివాదాస్ప‌ద అంశాలు ఉన్నాయో? త‌మ‌కు తెలియ‌వ‌ని అలాంట‌ప్పుడు చ‌ర్య‌లు ఎలా తీసుకుంటామని స్ప‌ష్టం చేసింది. రిలీజ్ అయిన త‌ర్వాత అభ్యంత‌ర క‌ర స‌న్నివేశాలుంటే అప్పుడు చ‌ర్య‌లు తీసుకుంటాం? త‌ప్ప ముందుగా చేసేదేమి లేద‌ని ఎన్నిక‌ల అధికారి ర‌జ‌త్ కుమార్ ఫిర్యాదుదారుల‌కు క‌రాఖండీగా చెప్పేసారు. దీంతో రిలీజ్ పోరులో టీడీపీ నాయ‌కులకు, వ‌ర్మ‌కు నెలకున్న‌స‌న్నివేశం న‌డుమ వ‌ర్మ‌దే పై చేయా అయింది.

ఈ ఉత్సాహాంలో వ‌ర్మ మ‌రో్ హాట్ అప్ డేట్ అందిచాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం క‌డ‌ప న‌డిబొడ్డున `వెన్నుపోటు` అలియాస్ `ఎన్టీఆర్ నైట్` పేరుతో చేస్తున్న‌ట్లు కొద్దిసేప‌టి క్రిత‌మే ప్ర‌క‌టించాడు. అయితే ఏ తేదీన ఈవెంట్ చేస్తార‌న్న‌ది వెల్ల‌డించ‌లేదు గానీ, అతి త్వ‌ర‌లోనే భారీ ఎత్తున నిర్వ‌హిస్తున్నట్లు తెలిపాడు. చివ‌రిగా జై ఎన్టీఆర్ అంటూ ట్విట్ కు ముగింపు ప‌లికాడు. మ‌రి రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్ర‌ధాన జిల్లాల‌ల‌ను అన్నింటిని వ‌దిలేసి క‌డ‌ప‌కే ఎందుకెళ్తున్నాడో? ఈవెంట్ రోజున రివీల్ చేస్తాడేమో చూద్దాం.