ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మ‌రో కిరికిరి

Last Updated on by

వివాదాస్ప‌ద చిత్రం `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` తెలంగాణ స‌హా విదేశాల్లో రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో సీఎం చంద్ర‌బాబును విల‌న్ గా చూపించార‌ని.. ఏపీలో ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉన్నందుకు రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని కోర్టులో వ్యాజ్యం దాఖ‌లైంది. రిలీజ్ కి తేదేపా నాయ‌కులు అడ్డంకులు సృష్టించారు. ఎల‌క్ష‌న్ కోడ్ నేప‌థ్యంలో దానిపై గ‌త కొంత‌కాలంగా విచార‌ణ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కోర్టు న్యాయ‌మూర్తులు ఈ సినిమాని చూసేవ‌ర‌కూ రిలీజ్ చేయాలా.. వ‌ద్దా? అన్న డైలమా కొన‌సాగింది. దాంతో ఇప్ప‌టివ‌ర‌కూ ఏపీలో రిలీజ్ కాలేదు. అయితే నైజాంలో ఈ చిత్రం మార్చి 29న రిలీజైంది. సినిమాకి పాజిటివ్ టాక్ తో పాటు బ‌య్య‌ర్ల‌కు లాభాలొచ్చాయ‌ని ప్ర‌చార‌మైంది. ల‌క్ష్మీ పార్వ‌తి కోణంలో ఆర్జీవీ ఎన్టీఆర్ జీవితాన్ని చూపించిన తీరు.. నంద‌మూరి కుటుంబాన్ని డీగ్రేడ్ చేస్తూ ఎలివేట్ చేసిన తీరుకు ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

అయితే ఈ సినిమా ఏపీలో ఎన్నిక‌ల ముందు రిలీజ్ కాక‌పోయినా క‌నీసం ఎల‌క్ష‌న్ పూర్త‌యిన మ‌రుస‌టి రోజు అయినా రిలీజ‌వుతుందా? అంటే ఇప్పుడు దానికి కూడా సందిగ్ధ‌త నెల‌కొంది. ఇప్పుడే అందిన తాజా వార్త అంటూ ప్ర‌ముఖ నిర్మాత రామ‌స‌త్య‌నారాయ‌ణ అందించిన వివ‌రం ప్ర‌కారం….లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని అమరావతి హైకోర్టు లో జ‌డ్జీలు చూసారు…తీర్పు ను సోమవారం నాటికి వాయిదా వేశారు. 12 వ తేదీ విడుదల లేదు అని తెలిసింది. 19 వ తేదీ రిలీజ‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న తెలిపారు. అయితే ఇప్ప‌టికే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి జ‌ర‌గాల్సిన డ్యామేజీ జ‌రిగిపోయింది. ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో చూడాల‌నుకున్న వాళ్లంతా ఇప్ప‌టికే పైర‌సీలో చూసేస్తుండ‌డంతో ఆ మేర‌కు క‌లెక్ష‌న్ల‌కు పంచ్ ప‌డిన‌ట్టే.

Also Watch : Chitralahari Posters

User Comments