ఓవ‌ర్సీస్‌లో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ హ‌వా

Last Updated on by

1.5 మిలియ‌న్ డాల‌ర్లు అప్పుడే.. అంటే 10కోట్లు సుమారు.. ఈ గురువారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఇంత పెద్ద మొత్తాన్ని వ‌సూలు చేసిందా? అంటే అవున‌నే తాజాగా అమెరికా డిస్ట్రిబ్యూట‌ర్ల నుంచి స‌మాచారం అందింది. ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కూ (గురు, శుక్ర‌) రెండు రోజుల్లో మొత్తం 1.59 ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌సూలు చేసింద‌ని రిపోర్ట్ అందింది. అంటే సుమారు 10 కోట్ల వ‌సూళ్లు అమెరికా నుంచే వ‌సూల‌య్యాయ‌నేది అంచ‌నా.

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు .. బ‌యోపిక్ కి ఉన్న పాపులారిటీతో ఆరంభం మూడు రోజులు ఈ స్థాయి వ‌సూళ్లు సాధించినా, ఆ త‌ర్వాత వ‌చ్చిన మ‌హానాయ‌కుడు అంత పెద్ద ఊపు తేలేక‌పోయింది. బ‌యోపిక్ ఫ్లాప్ రిజ‌ల్టును మూట‌గ‌ట్టుకుంది. అయితే ఆ రెండు సినిమాల‌కు కొన‌సాగింపు సినిమాగా రిలీజైన `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` మాత్రం క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. అమెరికా ట్రేడ్ రిపోర్ట్ ప్ర‌కారం.. ఈ వారం రిలీజైన ఐదు సినిమాల వ‌సూళ్ల వివరాల్ని ప‌రిశీలిస్తే.. శుక్ర‌వారం నాటికే.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ -$158,970 , సూర్య కాంతం- $13,570, సూప‌ర్ డీల‌క్స్ – $121,525, ఐరా- $4,298, హోట‌ల్ ముంబై- $ 1,129,340, కేస‌రి – $ 1,383,495 వ‌సూళ్ల‌ను అందుకున్నాయి.

User Comments