బ‌స్తీ మే స‌వాల్..న‌డిరోడ్డు మీద వ‌ర్మ

Last Updated on by

ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపాడు. న‌డిరోడ్డు మీద‌నే ప్రెస్ మీట్ పెడ‌తా. ఇప్పుడు ఎవ‌డు అడ్డొస్తాడో చూస్తాన‌న్న‌ శైలిలో త‌న ట్విట‌ర్ పేజీలో ఓపోస్ట్ వ‌దిలాడు. మ‌రి వ‌ర్మ ఇంతంగా ఆవేశప‌డ‌టానికి కార‌ణం ఏంటి? అంటే అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. ఏపీలో మే 1న `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దినిలో భాగంగా ఓ ప్ర‌మోష‌న్ ఈవెంట్ అమ‌రావ‌తిలో చేయాల‌నుకున్నాడు వ‌ర్మ‌. దీంతో నోవోటాల్ ను వెన్యూగా ఫిక్స్ చేశారు. అయితే వ‌ర్మ యాంటీ వ‌ర్గం ఆ హోట‌ల్ యాజ‌మాన్యాన్ని బెదిరించిందిట‌. దీంతో వ‌ర్మ కు వెన్యూ ఇవ్వ‌డానికి నిరాక‌రించింది.

మిగ‌తా స్టార్ హోట‌ళ్ల ప‌రిస్థితి అంతేన‌ట‌. ఈ విష‌యాన్ని వ‌ర్మ స్వ‌యంగా వెల్ల‌డించారు. మ‌నంద‌రికి తెలిసిన ఒక వ్య‌క్తి భ‌యంతో వాళ్లంతా జ‌డిసి పోయారని తెలిపారు. అయినా వ‌ర్మ మొండి ధైర్యం గురించి మ‌న‌కి తెలియందా? హోట‌ల్ కాక‌పోతే న‌డిరోడ్డు మీద ప్రెస్ మీట్ పెడ‌తాన‌ని టైమ్ కూడా ఫిక్స్ చేసాడు. విజ‌య‌వాడ పైపుల రోడ్డులో ఎన్టీఆర్ స‌ర్కిల్ ద‌గ్గ‌ర ఈరోజు 4 గంట‌ల‌కే ప్రెస్ మీట్. మీడియా మిత్రుల‌కి, ఎన్టీఆర్ నిజ‌మైన అభిమానుల‌కి, నేనేంటే అంతే ఇష్ట‌ప‌డేవారు అంతా ఈ మీటింగ్ పొల్గొనండి. ఇదే నా బహిరంగ ఆహ్వనం అని పోస్ట్ లో పేర్కొన్నారు.