ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ ఫ్రైడే డిసైడ్ చేస్తుందా?

Last Updated on by

`ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ని మార్చి 29న రిలీజ్ చేస్తున్న‌ట్లు రాంగోపాల్ వ‌ర్మ స‌గ‌ర్వంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డిన నేప‌థ్యంలో ఎట్టిప‌రిస్థితుల్లో 29న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప‌ట్టుబ‌ట్టి ఉన్నారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో పొలిటిక‌ల్ ఒత్తిళ్లు ఎదురైనా? వ‌్య‌క్తిగ‌త బెందిర‌పుల‌కు దిగినా? వ‌ర్మ వాటిని ఏ మాత్రం కేర్ చేయ‌కుండా మొండి ధైర్యంతో ముందుకెళ్లున్నారు. ఇటీవ‌లే హైకోర్టు కూడా సినిమా ఆప‌డానికి వీల్లేదంటూ తీర్పునివ్వ‌డంతో 29న రిలీజ్ ప‌క్కా? అనే ప్రేక్ష‌కులు సైతం కాన్పిడెంట్ గా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో సెన్సార్ నుంచి ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని వాద‌న‌లు వినిపించాయి.

అయితే తాజాగా అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం సినిమా రిలీజ్ అవుతుందా? లేదా? అన్న‌ది సెన్సార్ చేతుల్లోనే ఉంద‌ని మెజార్టీ వ‌ర్గం భావిస్తోంది. ఈ శుక్ర‌వారం హైద‌రాబాద్ రిజ‌న‌ల్ సెన్సార్ బోర్డు స‌భ్యులు సినిమా చూడ‌నున్నారు. అనంత‌రం సినిమా లో ఉన్న స‌న్నివేశాల‌ను బ‌ట్టి 29న రిలీజ్ చేయాలా? ఎన్నిక‌లు పూర్త‌య్యేవ‌ర‌కూ హోల్డ్ లో పెట్టాలా? అన్న దానిపై నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఒక‌వేళ సెన్సార్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన వివాదాస్ప‌ద స‌న్నివేశాలుంటే ఎడిట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి స‌న్నివేశాలు ఎడిట్ చేస్తే కిల్ అయ్యే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర్మ అన్ని స‌వాళ్ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొని తిప్పికొట్టాడు. అస‌లైన స‌వాల్ శుక్ర‌వారం ఎదురు కాబోతుంది. సెన్సార్ కామ్ గా క్లీన్ చీట్ ఇస్తే ప‌ర్వాలేదు. లేదంటే మ‌ళ్లీ వ‌ర్మ చెల‌రేగ‌డం కాయం. గ‌తంలో ప‌లుమార్లు వ‌ర్మ సెన్సార్ స‌భ్యుల‌ను విబేధించిన సంగ‌తి తెలిసిందే.

Also Read: Fresh Censor Date For Lakshmi’s Ntr

User Comments